Site icon HashtagU Telugu

Lumpy Virus : మ‌హారాష్ట్ర‌లో భ‌య‌పెడుతున్న లంపి వైర‌స్‌.. 25 జిల్లాల్లో .. ?

Lampi Imresizer

Lampi Imresizer

మహారాష్ట్రలో లంపి వైరస్ భ‌య‌పెడుతుంది. 25 జిల్లాల్లో ఈ వైర‌స్ సోకి 126 ప‌శువులు చ‌నిపోయాయ‌ని రాష్ట్ర ప‌శుసంవ‌ర్ధ‌క‌శాఖ అధికారులు తెలిపారు. జల్గావ్ జిల్లాలో 47, అహ్మద్‌నగర్ జిల్లాలో 21, ధులేలో 2, అకోలాలో 18, పూణేలో 14, లాతూర్‌లో 2, సతారాలో 6, బుల్దానాలో ఐదు, అమరావతిలో ఏడు, సాంగ్లీ, వాషిమ్‌లో ఒకటి, జల్నాలో ఒకటి, నాగ్‌పూర్ జిల్లాలో ఒకటి సహా మొత్తం 126 జంతువులు వైర‌స్ సోకి చనిపోయాయి.

లంపీ స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ జంతువుల నుండి లేదా ఆవు పాల ద్వారా మానవులకు సంక్రమించదని అధికారులు తెలిపారు. లంపి స్కిన్ డిసీజ్ (ఎల్‌ఎస్‌డి) మహారాష్ట్ర అంత‌టా వేగంగా విస్తరిస్తోంది. ఇది గోవుల చర్మసంబంధమైన వైరల్ వ్యాధి. ఈ వ్యాధి జంతువుల‌కు మాత్ర‌మే సోకుతుంద‌ని.. దీనిపై పుకార్లు వ్యాప్తి చేస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఐఎఎస్ అధికారి సచీంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. వ్యాధి చికిత్సలో అవసరమైన మందుల కొనుగోలు కోసం జిల్లాకు రూ. కోటి చొప్పున DPC ద్వారా నిధులు అందుబాటులో ఉచిన‌ట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. మహారాష్ట్ర యానిమల్ అండ్ ఫిషరీస్ సైన్సెస్ యూనివర్శిటీ (MAFSU) యొక్క వ్యాక్సినేటర్‌లు, ఇంటర్న్‌లకు ప్రతి టీకాకు రూ.3 గౌరవ వేతనం కూడా ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది.