Site icon HashtagU Telugu

Indian Student Dead : అమెరికాలో డేంజర్ బెల్స్.. మరో భారత విద్యార్థి మృతి.. నెలరోజుల్లో ఐదుగురు

Indian Student Dead

Indian Student Dead

Indian Student Dead : అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన భారత విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో భారత విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు వదిలాడు. ఇండియానాలోని వారెన్ కౌంటీ పరిధిలో ఉన్న క్రోస్ గ్రోవ్ నేచర్ ప్రిజర్వ్‌ అనే పార్కులో అతడి  డెడ్ బాడీ లభ్యమైంది. సోమవారం సాయంత్రం డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. చనిపోయిన భారత విద్యార్థి పేరు  సమీర్ కామత్ (23) అని తెలిపారు. అతడు పర్డ్యూ యూనివర్సిటీలో డాక్టరేట్ చేస్తున్నట్లు తెలిసింది. సమీర్ కామత్‌కు అమెరికా పౌరసత్వం కూడా ఉందని సమాచారం. 2023 ఆగస్టులోనే అతడు మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశాడు. 2025 సంవత్సరం నాటికి సమీర్ డాక్టరేట్ కోర్సు పూర్తయ్యేదని అంటున్నారు. సమీర్(Indian Student Dead) డెడ్ బాడీని శవపరీక్ష కోసం పంపించారు. దాని నివేదిక వస్తే.. అది హత్యా ? ఆత్మహత్యా ? అనే విషయం బయటికి వస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :95 Years Graduate : 95 ఏళ్ల ఏజ్‌లో పీజీ చేశాడు.. నెక్ట్స్ టార్గెట్ పీహెచ్‌డీ

తాజాగా హైదరాబాద్ యువకుడిపై.. 

అమెరికాలోని చికాగోలో నలుగురు దొంగల దాడిలో హైదరాబాద్ యువకుడు సయ్యద్ మజాహిర్ అలీ తీవ్రంగా గాయపడ్డాడు. ఇండియానాలోని వెస్లియన్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ చదువుతున్న సయ్యద్ మజాహిర్ అలీపై గత ఆదివారం ఉదయం క్యాంప్‌బెల్ అవెన్యూలో ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ఆ తర్వాత సయ్యద్ మజాహిర్ వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు. హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో నివసిస్తున్న అలీ భార్య సయ్యదా రుక్వియా ఫాతిమా రజ్వీ స్పందిస్తూ.. తన భర్తకు మంచి వైద్యం అందేలా సహాయం చేయాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి అమెరికాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రికి లేఖ రాశారు. తన భర్త భద్రత గురించి తాను ఆందోళన చెందుతున్నానని ఆమె తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో రికార్డ్ అయింది. అలీ రోడ్డుపై నడుస్తుండగా ముగ్గురు వెంబడించి దాడికి పాల్పడ్డారు.