Covid Sub-Variant: 3 రాష్ట్రాల్లో 21 కొత్త వేరియంట్ JN1 కేసులు

ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.

Covid Sub-Variant: కరోనా మహమ్మారి బాధ తప్పిందనుకునే లోపు దాని రూపాన్ని మార్చుకుని మరో అవతారంతో దండయాత్ర మొదలు పెట్టింది. ఇండియాలో అడుగుపెట్టిన కొవిడ్ కొత్త వేరియంట్ JN1 వివిధ దేశాలకు విస్తరించింది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. కాగా భారతదేశంలో JN1 కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు 3 రాష్ట్రాల్లో 21 కేసులు నమోదయ్యాయి. JN1 వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గోవాలో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి, కేరళ మరియు మహారాష్ట్రలలో ఈ JN1 రకం కోవిడ్‌లో ఒక్కొక్క కేసు నమోదైంది.మరోవైపు.. కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్కరోజే 614 కేసులు, 3 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది మే 21 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో దేశంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 2311కి చేరుకుందని వెల్లడైంది. కోవిడ్‌ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవియా ఈరోజు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. . JN1 కరోనా వేరియంట్ వ్యాప్తి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కొత్త కోవిడ్ సబ్‌వేరియంట్ JN1 రకం ఇప్పటికే చాలా దేశాల్లో కనిపించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికా, చైనా, సింగపూర్‌తో పాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు వెల్లడైంది. ఈ JN1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని స్పష్టమవుతోంది. మరోవైపు, సింగపూర్‌లో గత వారంలోనే 56,000 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ఇది ప్రపంచాన్ని తీవ్రంగా భయపెడుతోంది.

Also Read: Sajjanar: బస్సుల్లో ప్రయాణించాలంటే ఒరిజనల్ గుర్తింపు కార్డు తప్పనిసరి!