Jungle Raj : దుండగులు దారుణానికి తెగబడ్డారు. దళిత కాలనీలోని 21 ఇళ్లకు నిప్పుపెట్టారు. బుధవారం అర్ధరాత్రి బిహార్‌లోని నవాడా జిల్లాలో జరిగిన ఈ అమానుష ఘటనకు సంబంధించిన వివరాలు ఆలస్యంగా గురువారం ఉదయం బయటికి వచ్చాయి.
Also Read :Article 370 Restoration : ఆర్టికల్ 370 విషయంలో మా వైఖరి, కాంగ్రెస్-ఎన్‌సీ వైఖరి ఒక్కటే : పాకిస్తాన్
నవాడా జిల్లాలోని ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఓ భూవివాదం(Jungle Raj) విషయంలో ఘర్షణ జరిగింది. తొలుత స్థానికులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం 21 ఇళ్లకు నిప్పు పెట్టారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ఇళ్లలో ఉన్న దుస్తులు, ఫర్నీచర్, వస్తువులు కాలిపోయాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో కృష్ణానగర్‌లో పెద్దసంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితుడితో సహా 10 మందిని అరెస్టు చేశారు. ఇతర నిందితులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇళ్లు కాలిపోయిన వారికి ఆహార ప్యాకెట్లు, తాగునీరు సహా సహాయక సామగ్రిని అందిస్తున్నామని చెప్పారు. వారు ఉండేందుకు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కాగా, అనధికారిక సమాచారం ప్రకారం 80 ఇళ్లు ఈ ఘటనలో కాలిపోయాయని తెలిసింది.
Also Read :Unit 8200 : లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల వెనుక ‘యూనిట్ 8200’.. ఏమిటిది ?
ఈ ఘటన నేపథ్యంలో బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దళితుల ఇళ్లకు నిప్పుపెట్టిన ఘటనను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు. ఎన్డీఏ, దాని మిత్ర పక్షాలు పాలించే రాష్ట్రాలు నేరాలు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. బిహార్‌లో జంగిల్ రాజ్ నడుస్తోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విమర్శించారు. నితీశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే దళితులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ ఘటన బాధాకరమని బీఎస్పీ చీఫ్ మాయవతి అన్నారు. బాధితులను వెంటనే ఆదుకోవాలని బిహార్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.