2024 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ (Budget 2024) ప్రవేశ పెట్టబోతున్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ ఫై సామాన్య ప్రజలు గప్పెడు ఆశలు పెట్టుకున్నారు. కాకపోతే 2024లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తెలపడం అన్నమాట. కాబట్టి ఓ విధంగా బిజెపి సర్కారుకు ఈ పర్యాయం ఇదే చివరి బడ్జెట్ కానుంది. ఈసారి మధ్యంతర బడ్జెట్ కావడంతో కీలక ప్రకటనలు లేకపోయినప్పటికీ ఉన్నంతలో మధ్యతరగతిని ఆకట్టుకుంటూనే ఉపాధి కల్పన, వృద్ధికి ఊతమిచ్చే చర్యలు చేపడతారని తెలుస్తుంది. ఈ బడ్జెట్ బట్టి ఎన్నికల లెక్కలు కూడా మారతాయని భవిస్తూ..సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ ను సిద్ధం చేస్తున్నట్లు వినికిడి.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు హోమ్ లోన్ (Home Loan) తీసుకునే వారికి ఈ బడ్జెట్ కాస్త ఉపశమనం కలిపిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలని కలలు కంటుంటారు. కానీ ఇప్పుడున్న ధరల ను చూసి ఆ కలలు కలగానే మిగులుతున్నాయి. కొంతమంది మాత్రం హోమ్ లోన్ తీసుకొని తమ కలను సాకారం చేసుకుంటున్నారు. హోమ్ లోన్ అనేది దీర్ఘకాలం పాటు EMI రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అప్పుగా తీసుకున్న అసలు, వడ్డీపై కూడా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. అయితే హోమ్ లోన్ (Home Loan) తీసుకునే వారికి ప్రభుత్వం తీపికబురు చెప్పబోతుందని సమాచారం.
హోమ్ లోన్ తీసుకునే సామాన్య ప్రజలకు ఊరట కలిగిలా ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పించాలని హోమ్ లోన్ అసలు, వడ్డీ పేమెంట్లపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని పలు రియల్ ఎస్టేట్ ఏజెన్సీలు కోరుతున్నాయి. అలాగే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసింది. ఆసారి ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ లో హోమ్ లోన్ పై ప్రోత్సాహకాల ప్రతిపాదనలు అమలు చేయాలని కోరింది.
ప్రస్తుతం హోమ్ లోన్స్ చెల్లిస్తున్న అసలుకు సెక్షన్ 80C పరిమితి ఒక లక్ష 50 వేల వరకు పన్ను మినహాయింపు ఉంది. దీనిపై పడే వడ్డీకి సెక్షన్ 24 (బి) ప్రకారం రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. అయితే వడ్డీపై పన్ను మినహాయింపుల మొత్తాన్ని రూ.5 లక్షలు చేయాలని క్రెడాయ్ కోరింది. దీని ద్వారా స్థిరాస్తి రంగం జీడీపీ, ఉద్యోగాలు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం ఎంతో తోడ్పడుతుందని, దీనికి ప్రభుత్వ చేయూత ఇవ్వాలని కోరింది. అయితే క్రెడాయ్ ప్రతిపాదనలపై ఈ సారి బడ్జెట్ లో గుడ్ న్యూస్ వినిపిస్తోందని అంటున్నారు. చూద్దాం నిర్మలమ్మ ఏంచేస్తుందో..ఎలాంటి గుడ్ న్యూస్ తెలుపుతుందో..!!
Read Also : Ayodhya : అయోధ్యలో మరో 13 దేవాలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాట్లు