Site icon HashtagU Telugu

UP : ఏసీ పెంచి ఇద్దరు శిశువుల మృతికి కారణమైన డాక్టర్

2 Newborns Freeze To Death

2 Newborns Freeze To Death

ఇటీవల కాలంలో డాక్టర్ల నిర్లక్ష్యం ఎక్కువైపోతోంది. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకపు ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఆపరేషన్ చేస్తే కడుపులోనే కత్తులు మరచిపోతున్నారు..లేదంటే నిర్లక్ష్యంగా ఆపరేషన్ లు చేసి ప్రాణాలు తీస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ అయితే చల్లదనం కోసం ఏసీ ని విపరీతంగా పెంచి..ఇద్దరు నవ శిశువుల (Newborn babys) మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌(UP) లోని శామలి జిల్లాలో చోటుచేసుకుంది.

కైరాణా ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)లో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ తర్వాత వారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌కు తరలించారు. వీరిద్దరిని ఫొటోథెరపీ (Phototherapy) యూనిట్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇద్దరు చిన్నారులను పట్టించుకోని డాక్టర్‌ నీతు.. నిద్రపోవడానికి రాత్రంతా ఏసీని వేసుకున్నారు. ఉదయాన్నే చిన్నారులను చూసేందుకు కుటుంబసభ్యులు (Family members)వెళ్లేసరికి.. విగతజీవులయ్యారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.చిన్నారుల కుటుంబాల ఫిర్యాదు ఆధారంగా వైద్యుడిపై ఐపీసీ సెక్షన్ (IPC Sec) 304 కింద కేసు నమోదుచేసినట్టు కైరానా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ నేత్రపాల్ సింగ్ తెలిపారు. డాక్టర్ నీతును అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

Read Also : Manmohan Singh Birthday : మన్మోహన్ ది గ్రేట్.. పీఎం పోస్టుకు గౌరవాన్ని పెంచిన మహామహుడు

Exit mobile version