జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir)లోని రాజౌరీలో శనివారం (ఏప్రిల్ 29) జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఇద్దరు సైనికులు మరణించారు. అదే సమయంలో ఈ ప్రమాదంలో మరో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్‌ఓసీ) సమీపంలోని కెర్రీ సెక్టార్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం లోతైన లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Also Read: Traffic Restrictions: కొత్త సెక్రటేరియట్ ప్రారంభం.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు!
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఆర్మీ, పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నియంత్రణ రేఖ సమీపంలోని దుంగి గాలా సమీపంలో అంబులెన్స్ మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్, ఓ జవాన్ మృతి చెందినట్లు తెలిపారు. రెస్క్యూ సిబ్బంది వారి మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీశారు.