Site icon HashtagU Telugu

Drugs : కోల్‌కతాలో భారీగా ప‌ట్టుబ‌డిన హెరాయిన్‌.. ఐదుగురు అరెస్ట్‌

Drugs

Drugs

పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ దాడుల్లో హెరాయిన్ దొరిగింది. కోల్‌కతా లో 2.5 కిలోల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.హెరాయిన్ స‌ప్లై చేస్తున్నా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.2 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అజయ్ పాల్ (39), సబీర్ అహమ్మద్ (24), సుజోన్ సేఖ్ ​​(28), గోబిందా మోండల్ (37), సరోబ్ షేక్ (23)లుగా గుర్తించారు. డమ్ డమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుకాంత పల్లి బస్ స్టాప్ సమీపంలో మూన్ లైట్ హోటల్ ఎదురుగా, బెల్ఘరియా ఎక్స్‌ప్రెస్‌వే బల్లి సరిహద్దు పార్శ్వానికి సమీపంలో పెద్ద మొత్తంలో నిషిద్ధ హెరాయిన్ తరలింపుపై STF బృందానికి స‌మాచారం అందింది. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ బృందం ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్టీఎఫ్ బృందం నిందితుడి వద్ద నుంచి 2.5 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, మారుతీ బ్రీజా జెడ్‌డిఐ, మారుతి సుజుకి vxi SX4 కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. దమ్ డమ్ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ చట్టం కింద కేసు నమోదైంది.