Covid-19: దేశంలో కొత్త కరోనా కేసులు 187 నమోదు

  • Written By:
  • Updated On - January 26, 2024 / 09:06 PM IST

Covid-19: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. భారతదేశం జనవరి 26 శుక్రవారం నాడు 187 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. గత 24 గంటల్లో మహారాష్ట్ర నుండి ఒక మరణం నమోదైంది. మరణాల సంఖ్య 5,33,443 గా ఉంది. ఇంతలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,674కి పడిపోయింది. గత వారం వరకు 2,000 కంటే ఎక్కువ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతానికి జనవరి 2020లో ప్రారంభ వ్యాప్తి నుండి భారతదేశంలో మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4,50,24,735కి చేరుకుంది. INSACOG ప్రకారం కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1కి చెందిన 1,640 కేసులు ఉన్నాయి.  మహారాష్ట్ర 477 కేసులతో ముందంజలో ఉండగా, కర్ణాటకలో 249 ఉన్నాయి. కేరళ 156 కేసులను నమోదు చేయగా, గుజరాత్‌లో 127 కేసులు నమోదయ్యాయి. వేరియంట్‌ని నివేదించే ఇతర రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌లో 96 కేసులు, గోవాలో 90, తమిళనాడులో 89 కేసులు ఉన్నాయి.

రాజస్థాన్‌లో 38, తెలంగాణలో 32, ఛత్తీస్‌గఢ్‌లో 25, ఢిల్లీలో 21 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, హర్యానాలో ఐదు, ఒడిశాలో మూడు, ఉత్తరాఖండ్, మణిపూర్, మధ్యప్రదేశ్, నాగాలాండ్‌లో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ ఉప-వేరియంట్ వ్యాప్తిని చెక్ పెట్టేందుకు కేంద్రం మంత్రిత్వ శాఖ అనేక గైడ్ లైన్స్ జారీ చేస్తోంది.