Site icon HashtagU Telugu

Nurse Gang Rape : నర్సుపై గ్యాంగ్ రేప్..బిల్డింగ్ పై నుంచి వేలాడిదీసి హత్య..!!

Unnao Gang Rape

Unnao Gang Rape

ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ లో దారుణం జరిగింది. జీవితంపై ఎన్నో ఆశలతో కొత్తగా కట్టిన హాస్పిటల్ లో నర్సుగా కెరీర్ ప్రారంభించిన యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. కొందరు దుండగులు 19ఏళ్ల ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగలేదు. అతి కిరాతంగా హత్య చేశారు. బిల్డింగ్ పై నుంచి వేలాడదీసి ఉరేసి ప్రాణం తీసారు దుర్మార్గులు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లా దుల్లాపూర్వ గ్రామంలో నిర్మించిన కొత్త జీవన్ ఆసుపత్రిలో శనివారం జరిగింది.

శనివారం ఉదయం బిల్డింగ్ పై నుంచి వేలాడుతున్న యువతి శవాన్ని చూసిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయని నిర్దారించారు. శుక్రవారం రాత్రి ఆ యువతి నైట్ డ్యూటీ చేసిందని…ఆసుపత్రిలోనే నిద్రపోయిందని పోలీసులకు సిబ్బంది తెలిపారు.

అయితే బాధితురాలి తల్లిదండ్రులు …తమ కూతురిని గ్యాంగ్ రేప్ చేసి చంపారని…ఆరోపించారు. దీంతో పోలీసులు సామూహిక అత్యాచారం హత్య కేసుగా నమోదు చేశారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. న్యూజీవన్ ఆసుపత్రిని గతనెల ఏప్రిల్ 25న బంగార్మౌ ఎమ్మెల్యే శ్రీకాంత్ కటియార్ ప్రారంభించారు.

Exit mobile version