Site icon HashtagU Telugu

Bihar : బీహార్ లో ఘోరప్రమాదం…జనంపైకి దూసుకెళ్లిన కారు..18మందికి తీవ్రగాయాలు..!!

road accident

road accident

బీహార్ లోని సరన్ లో ఘోరప్రమాదం జరిగింది. వేగం వచ్చిన కారు అదుపు తప్పి జనాలపై కి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 18మందితీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శరణ్ లో ఏర్పాటు చేసిన ఓ విందుకు భారీగా జనాలు హాజరయ్యారు. అంతా భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారి కారు దూసుకొచ్చింది. ఆకస్మాత్తుగా కారు దూసుకురావడంతో జనాలు కేకలు వేశారు.

జనాలపైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో చాలామందికి తీవ్రగాయాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలంలో భయానకర వాతావరణం నెలకొంది.

ముందుగా వేగంగా వచ్చిన కారు రోడ్డుపక్కన ఉన్న దుకాణాన్ని ఢీ కొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అదుపుతప్పి విందు చేస్తున్నవారిపైకి దూసుకొచ్చినట్లు తెలిపారు. కారు అతివేగంతో ఉన్నట్లు చెప్పారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిందని వెల్లడించారు.