Delhi: ఢిల్లీలో దారుణం.. బాలికపై కాల్పులు జరిపిన స్నేహితుడు

ఢిల్లీలోని (Delhi) నంద్ నగ్రిలో మైనర్ బాలికపై కాల్పులు జరిగాయి. 16 ఏళ్ల బాలికపై ఖాసీం అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఖాసీంకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

  • Written By:
  • Publish Date - March 7, 2023 / 11:40 AM IST

ఢిల్లీలోని (Delhi) నంద్ నగ్రిలో మైనర్ బాలికపై కాల్పులు జరిగాయి. 16 ఏళ్ల బాలికపై ఖాసీం అనే నిందితుడు కాల్పులు జరిపాడు. ఖాసీంకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన సోమవారం రాత్రి 8.27 గంటల ప్రాంతంలో జరిగింది.

పూర్తి వివరాలలోకి వెళ్తే.. ఢిల్లీలోని నంద్ నగ్రిలో సోమవారం 16 ఏళ్ల బాలికపై ఆమె స్నేహితుడే కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన తర్వాత స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం ఢిల్లీ పోలీసులు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో పాటు ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించారు. బాధిత బాలిక జీటీబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విషయం విచారణలో ఉంది. సోమవారం రాత్రి 08:27 గంటలకు నంద్ నగ్రి పోలీస్ స్టేషన్‌లో కాల్పుల ఘటనకు సంబంధించి పిసిఆర్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని సుభాష్ పార్క్, నంద్ నగ్రి SHO సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడికి వెళ్లి చూడగా 16 ఏళ్ల మైనర్ బాలికను ఆమె స్నేహితుడు ఖాసిం కాల్చినట్లు గుర్తించారు.

Also Read: Maternity Leave: కేరళ యూనివర్సిటీ కీలక ప్రకటన.. వారికి కూడా 6 నెలల మెటర్నిటీ లీవ్

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను GTB ఆసుపత్రికి తరలించారు. బాలిక జిటిబి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగగా, ఘటనా స్థలంలో తగిన సిబ్బందిని మోహరించారు. అనేక కోణాలలో తదుపరి విచారణ కొనసాగుతోంది. 16 ఏళ్ల బాలికకు 19-20 ఏళ్ల వయస్సున్న ఖాసిం స్నేహితుడు. అయితే వీరిద్దరి మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. దీంతో ఖాసింకు కోపం వచ్చి తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపినట్లు సమాచారం. నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు అనేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు అయ్యింది.