Site icon HashtagU Telugu

BSF Jobs : బీఎస్ఎఫ్‌లో 141 కానిస్టేబుల్, సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు

141 Constable Jobs In Bsf

BSF Jobs : బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ (BSF Jobs)‌లో 141 గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో అత్యధికంగా ఏఎస్‌ఐ (ఫిజియోథెరపిస్ట్) పోస్టులు  47,  ఏఎస్‌ఐ (ల్యాబ్ టెక్నీషియన్) పోస్టులు 38, కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్) పోస్టులు 22 ఉన్నాయి.  అర్హత కలిగిన అభ్యర్థులు(BSF Constable) ఈనెల 25లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. వాస్తవానికి జులై 17తోనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముగిసింది.  దీంతో తాజాగా మరోసారి దరఖాస్తు గడువును పెంచారు. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపికచేస్తారు. ఇన్‌స్పెక్టర్ (లైబ్రేరియన్), ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్) పోస్టులకు పరీక్ష ఫీజు  రూ.247.20. వెటర్నరీ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు పరీక్ష ఫీజు రూ.147.20. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఈ ఫీజును చెల్లించవచ్చు.ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join

Also Read :BJP : తెలంగాణ బీజేపీ ఎందుకు సైలెంట్ అయ్యింది ? కారణం అదేనా ?

Also Read :Bangladesh : బంగ్లాదేశ్‌లో కర్ఫ్యూ.. వందలాదిగా తిరిగొస్తున్న భారత విద్యార్థులు