Site icon HashtagU Telugu

Billboard Horror : హోర్డింగ్ హారర్.. 14 మంది బలి.. 65 మందికి గాయాలు

Billboard Horror

Billboard Horror

Billboard Horror : దేశ వాణిజ్య రాజధాని ముంబైలో దారుణం జరిగింది.  నగరంలోని సమతా నగర్‌లో ఈదురుగాలుల ధాటికి భారీ బిల్ బోర్డు కుప్పకూలిన ఘటనలో 14 మంది దాని కింద నలిగిపోయి చనిపోయారు. మరో 65 మంది గాయాలతో ఆస్పత్రుల్లో చేరారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు బిల్ బోర్డు కూలింది. అప్పటి నుంచి చనిపోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ 14కు చేరింది.  100 అడుగుల ఎత్తైన ఇనుప హోర్డింగ్‌ ఈదురుగాలుల తీవ్రతకు పక్కనే ఉన్న రైల్వే పెట్రోల్‌ పంపుపై పడిందని వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ఈ హోర్డింగ్‌ ఏర్పాటుకు అనుమతులు తీసుకోలేదని ముంబై నగరపాలక సంస్థ అధికారులు వెల్లడించారు.  అదే నిజమైతే .. ఇన్నాళ్లుగా ఎందుకు దాన్ని తొలగించలేదు ? అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనపై(Billboard Horror) మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ మేరకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈదురుగాలుల ప్రభావంతో మెట్రో, లోకల్ రైలు సర్వీసులకు అంతరాయం కలిగింది. విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join

బిల్‌బోర్డ్ కూలడానికి ముందు..

సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు భారీ ధూళి తుఫాన్ ముంబై నగరాన్ని కమ్మేసింది. దీంతో ఒక్కసారిగా రోడ్లపై వాహనాలు నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.  మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురిసింది. ఓ వైపు ధూళి తుఫాన్.. ఇంకోవైపు భారీ వర్షంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ముంబైలోని ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారవి ప్రాంతంలో బలమైన గాలులు, వర్షం పడింది. ఘట్‌కోపర్, బాంద్రా కుర్లా, ధారావి ప్రాంతాల్లో బలమైన గాలులతో వర్షం కురిసింది. ఈక్రమంలోనే ఘట్‌కోపర్‌లోని చెద్దా నగర్ జంక్షన్‌లో 100 అడుగుల బిల్ బోర్డు కూలి సమీపంలోని పెట్రోల్ బంక్‌పై పడింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబై ఒకటి. సోమవారం ఈదురుగాలులు, భారీ వర్షం నేపథ్యంలో ఇక్కడి నుంచి విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత సాయంత్రం 5.03 గంటలకు రాకపోకలను పునరుద్ధరించారు. వర్షం కురిసిన సమయంలో 15 విమానాలను దారి మళ్లించారు.

Also Read : Alert: మగవాళ్లు బీ అలర్ట్..  ఆ విషయాల పట్ల రహస్యంగా ఉండాలి!