Indian Navy : 13 ఏండ్ల నెత్తుటి జ్ఞాపకం

13 సంవత్సరాల క్రితం ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడి తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి.

  • Written By:
  • Publish Date - November 27, 2021 / 06:09 PM IST

13 సంవత్సరాల క్రితం ముంబాయిలో జరిగిన ఉగ్రవాద దాడి తాలూకు గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. నవంబర్ 26, 2008రోజు ముంబాయిలో జరిగిన హింసాకాండను ఇండియా ఎప్పటికీ మర్చిపోదనే చెప్పాలి.
ఆ దాడి తర్వాత ఇండియాలోని తీరప్రాంతం పూర్తిగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ముంబై పోలీస్ వ్యవస్థలో కూడా  విప్లవాత్మక మార్పులు చేశారు. ట్రైనింగ్‌, ఆయుధాల వాడకం, ఎటువంటి సమయంలోనైనా దాడుల్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం వంటి విషయాల్లో ఎంతో  అడ్వాన్స్మెంట్ సాధించారు. బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్స్, ఆయుధాల్ని కూడా పెద్ద సంఖ్యలో సమకూర్చుకున్నారు. భద్రతా సిబ్బందిని గణనీయంగా రిక్రూట్ చేసుకున్నారు.
ఇండియాలో ఎన్నో ఉగ్రదాడులు జరిగినా ముంబై దాడులు మాత్రం ఇండియన్స్ పై బలమైన ప్రభావాన్ని చూపాయని చెప్పుకోవచ్చు. ఈ దాడుల్లో వందలాది మంది సాధారణ ప్రజలతో పాటు మన దేశ ఆర్మీకి చెందిన కీలక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కాశ్మీర్ మినహా మిగతా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో ఇదే భారీ శోకాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.