దేశరాజధాని ఢిల్లీలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రాత్రి 8గంటల ప్రాంతంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.4గా నమోదు అయ్యింది. దీని కేంద్రం నేపాల్లో ఉంది. ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, పాకిస్తాన్ లేదా సమీప ప్రాంతాల్లో భూకంపాలు సంభవించినప్పుడుల్లా ఢిల్లీలో ప్రకంపనలు వస్తున్నాయి. దీని ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ తోపాటు ఉత్తరాఖండ్ లో కనిపించాయి. వారం రోజుల క్రితం కూడా ఢిల్లీలో భూమి కంపించింది. ఇప్పుడు మళ్లీ భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లేదా సమీప ప్రాంతాల్లో భూమి కంపించినప్పుడల్లా ఢిల్లీలో కూడా ప్రకంపనలు వస్తాయి. ఈ ప్రకంపనలు ప్రమాదకరమైనవి కానప్పటికీ…ప్రభుత్వం నివేదిక ప్రకారం ఢిల్లీలో చాలా పెద్ద భూకంపం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో ఎప్పుడైనా 7 నుంచి 7.9తీవ్రతతో భూకంపం సంభవించే ఛాన్స్ ఉందని అది చాలా పెద్ద విధ్వంసం కలిగిస్తుందని అంచనా వేస్తున్నారు. 2015 లో నేపాల్ లో భూకంపం విధ్వంసం స్రుష్టించిన సంగతి తెలిసిందే. అప్పుడు దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదు అయ్యింది.
ఢిల్లీలో నాలు ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చు. 2001లో భుజ్ లో భారీ విధ్వంసం జరిగింది. 2015లోనూ అదే తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే ఢిల్లీలో భారీ భవనాలు ఉన్నాయి. 6 కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే ఆ భవనాలు తట్టుకోలేవు. పెద్దెత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుందని కొన్నేళ్ల క్రితం భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ఒక నివేదికలో పేర్కొంది.
సీస్మిక్ హజార్డ్ మైక్రోజోనేషన్ ఆఫ్ ఢిల్లీ పేరుతో విడుదల చేసిన నివేదిక ప్రకారం…భూకంప ప్రమాదాన్ని బట్టి ఢిల్లీని మూడు జోనులుగా విభజించారు. యమునా నది ఒడ్డున ఉన్న చాలా ప్రాంతాలు, ఉత్తర ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, నైరుతి ఢిల్లీలోని కొంత భాగం అత్యంత ప్రమాదకర జోన్ లో ఉన్నాయి.