Encounter : ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌.. 13కు చేరిన మృతుల సంఖ్య

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 12:04 PM IST

Naxalite Killed In Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని జీజాపూర్‌ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పులు 10 గంటలపాటు కొనసాగిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లో (Bijapur Encounter) మృతుల సంఖ్య 13కు పెరిగింది. ఇప్పటివరకు 13 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని అధికారులు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బీజాపూర్‌ జిల్లా అడవుల్లో మావోయిస్టులు ప్లీనరీ నిర్వహించనున్నట్టు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు గార్డ్స్‌(డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్‌, కోబ్రా, బస్తర్‌ ఫైటర్స్‌, ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) భద్రతా బలగాలు గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో మంగళవారం ఉదయం కోర్‌చోలీ సమీపంలోని లెంద్రా అడవుల్లో తారసపడిన మావోయిస్టు దళాలు జవాన్లపై కాల్పులకు దిగాయి. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గ్రూపుల మధ్య దాదాపు రెండు గంటల పాటు తుపాకుల మోత మోగింది. ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిలో మొత్తం 1౩ మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీయెత్తున ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతున్నదని ఐజీ పీ సుందర్‌రాజ్‌(IGP Sundarraj) తెలిపారు. తాజా ఎన్‌కౌంటర్‌లో డీవీసీ మెంబర్‌ క్రాంతి ముచతోపాటు మరో కీలక సభ్యుడు పాపారావు మృతిచెందినట్లు ప్రాథమిక సమాచారం అందింది. మావోయిస్టులు భారీ సంఖ్యలోనే గాయపడ్డట్లు భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. కాగా, గత నెల 27న ఇదే బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం 45 మంది నక్సలైట్లు మృతిచెందారు.

Read Also: KCR : కేసీఆర్‌ను చూస్తే జాలేస్తోంది – సీఎం రేవంత్

కాగా, ఇటీవల బీజాపుర్​ జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మహిళతో సహా ఆరుగురు నక్సల్స్ మరణించారు. చికుర్​బత్తి – పుస్బాక సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మరోవైపు, బీజాపుర్​తో సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్​ ప్రాంతంలో ఈ ఏడాది భద్రతా దళాలు జరిపిన ఎన్​కౌంటర్లలో మృతిచెందిన నక్సలైట్ల సంఖ్య 37కు చేరింది. బీజాపుర్​ జిల్లా, బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ఏప్రిల్ 19న మొదటి దశలో పోలింగ్ జరగనుంది.