Site icon HashtagU Telugu

Tragic Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

Ktk Accidents

Ktk Accidents

ఇంట్లో నుండి బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి వచ్చేవరకు టెన్షనే..నిత్యం రోడ్ ప్రమాదాలు (Road Accidents) ఎంతోమంది అమాయకులను బలి తీసుకుంటున్నాయి. రోడ్డు జాగ్రత్తలు పాటించాలని..అతివేగం ప్రమాదకరం..మద్యంసేవించి వాహనం నడపరాదు.. వంటి సూచనలు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా..నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేస్తున్నారు. ప్రతి రోజులు దేశ వ్యాప్తంగా అనేక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక (Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాడగి తాలూకా, గుండెనహళ్లి క్రాస్ సమీపంలోని హావేరి వద్ద 48వ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగి 13 మంది మృతి చెందారు. 11 మంది అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

We’re now on WhatsApp. Click to Join.

కొంతమంది భక్తులు టెంపోలో బెళగావిలోని ఆలయాలు దర్శించుకుని తిరిగి వస్తుండగా గుండెనహల్లి సమీపంలో పూణె-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని టెంపో బలంగా ఢీకొట్టడంతో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు షిమోగా జిల్లా భద్రవతి తాలూకాలోని ఎమ్మినిహట్టి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ప్రమాద తీవ్రతకు కొన్ని మృతదేహాలు టెంపోలో చిక్కుకుపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతికష్టం మీద మృతదేహాలను వెలికి తీశారు. టెంపో ట్రావెల్ డ్రైవర్ అతివేగంగా నడపడం, అలాగే నిద్రమత్తులోకి జారుకోవడం ఈ ప్రమాదానికి కారణం అని పోలీసులు చెబుతున్నారు.

Read Also : Delhi Rains : ఢిల్లీలో మునిగిన రోడ్లు.. బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన