Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా.. 13 మంది మృతి

ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లా పీప్​లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - June 3, 2024 / 08:03 AM IST

Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడింది. ఈ ఘటనలో 13మంది చనిపోగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లా పీప్​లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్​లోని మోతీపురా ప్రాంతానికి చెందిన 30మంది పెళ్లి బృందం మధ్యప్రదేశ్​లోని కులామ్​పుర్​లో జరిగే పెళ్లికి ట్రాక్టర్​లో బయలుదేరింది. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లాలో ఉన్న పీప్​లోడీ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది.

We’re now on WhatsApp. Click to Join

స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో 14 మందిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని చికిత్స కోసం భోపాల్​‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. వీరికి ప్రాణాపాయం లేదని కలెక్టర్ హర్ష దీక్షిత్ వెల్లడించారు. ఇక మరణించిన  వారిలో నలుగురు చిన్నారులు ఉండటం విషాదకరం. ఈ ప్రమాదంపై(Tractor Trolley Overturns) మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈమేరకు వారు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ చేశారు.

Also Read :Best Motorcycle: ఈ రెండు సూప‌ర్ బైక్‌ల గురించి తెలుసా..? ఫీచ‌ర్లు ఇవే..!