Site icon HashtagU Telugu

Cyber Attack: 12 వేల భారత ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఇండోనేషియా హ్యాకర్ల కన్ను.. కేంద్రం అప్రమత్తం

Cyber Crime

Cyber Crime

ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గురువారం నాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సైబర్ దాడి (Cyber Attack) జరగవచ్చని హెచ్చరిక జారీ చేసింది. ఇండోనేషియాకు చెందిన అనుమానాస్పద బృందం దేశవ్యాప్తంగా 12,000 ప్రభుత్వ వెబ్‌సైట్‌(Govt Websites) లను లక్ష్యంగా చేసుకోవచ్చని హెచ్చరిక పేర్కొంది. కాగా.. దొంగిలించిన కంటెంట్‌ను ప్రసారం చేసే వెబ్‌సైట్‌లను బ్లాక్ చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

12000 భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లను సైబర్ హ్యాకర్లు హ్యాక్ చేసే ప్రమాదం ఉన్నందున హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. I4C అంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ భారత ప్రభుత్వ సంస్థ CERT అంటే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌కి ఈ హెచ్చరికను జారీ చేసింది. భారతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీల ప్రకారం.. 12000 ప్రభుత్వ వెబ్‌సైట్‌లు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వెబ్‌సైట్‌లను కలిగి ఉన్నాయి.

Also Read: Times Magazine 100: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వంద మందిలో షారుఖ్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి.

జారీ చేసిన హెచ్చరిక ప్రకారం.. ఈ హ్యాకింగ్ గ్రూప్ భారత ప్రభుత్వ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ 12000 ప్రభుత్వ వెబ్‌సైట్‌ల జాబితాను కూడా హ్యాకర్లు తయారు చేశారు. దీని గురించి భారతదేశంలోని సంబంధిత సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలను అప్రమత్తం చేశారు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన వెంటనే మూసేసే విధంగా హ్యాకర్లు ప్రభుత్వ వెబ్‌సైట్లను టార్గెట్ చేస్తున్నారని కూడా అలర్ట్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. అప్రమత్తమైన సంబంధిత ప్రభుత్వ అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సిస్టమ్‌లను ransomware దాడి చేయడం వల్ల సమస్యలు తలెత్తాయి.

Exit mobile version