1104 Railway Jobs : ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారి కోసం రైల్వేలో 1104 ‘యాక్ట్ అప్రెంటిస్’ పోస్టులు పడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్ గోరఖ్‌పుర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ) వీటి భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల యువతీయువకులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. నార్త్ ఈస్టర్న్ రైల్వే వెబ్ సైట్‌లో నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చూడొచ్చు. ఈ వెబ్‌సైట్‌లోని హోం పేజీలో ఉన్న రిక్రూట్‌మెంట్ లింక్‌పై క్లిక్ చేసి దరఖాస్తును సబ్మిట్ చేయొచ్చు. అప్లికేషన్ ఫారమ్‌ను తెరిచి.. దానిలో అన్ని వివరాలను నింపాలి. కావాల్సిన డాక్యూమెంట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి. అప్లికేషన్ ఫీజు రూ.100ను ఆన్లైన్లోనే చెల్లించాలి. చివరగా అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ అవుట్ తీసుకొని పెట్టుకోవాలి.
We’re now on WhatsApp. Click to Join.
మొత్తం 1104 పోస్టులను ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు. 2023 నవంబర్ 25 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయాలి. యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పదో తరగతిలో 50 శాతం మార్కులతో పాసై ఉండాలి. జాబ్‌కు అప్లై చేసే ట్రేడ్‌లో ఐటీఐ పాసై ఉండాలి. పదో తరగతి మార్కులు, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. మిగతా కేటగిరీల అభ్యర్థులు రూ.100 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఎంపికయ్యే వారికి ఉత్తరప్రదేశ్‌లోని పలు వర్క్ షాప్‌లలో ట్రైనింగ్ ఇస్తారు. పోస్టింగ్ కూడా అక్కడే(1104 Railway Jobs) ఉంటుంది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ డిసెంబర్ 24.