Site icon HashtagU Telugu

1100 Jobs : ఈసీఐఎల్‌లో 1100 జాబ్స్.. జూనియర్ టెక్నీషియన్స్‌కు గ్రేట్ ఛాన్స్

1100 Jobs

1100 Jobs

1100 Jobs : ఎలక్ట్రానిక్స్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 1100 జూనియర్ టెక్నీషియన్ జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 275 ఎలక్ట్రానిక్స్ మెకానిక్​  పోస్టులు,  275 ఎలక్ట్రీషియన్​ పోస్టులు, 550 ఫిట్టర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఎలక్ట్రానిక్స్ మెకానిక్​/ ఎలక్ట్రీషియన్​/ ఫిట్టర్​ ట్రేడుల్లో ఐటీఐ పాసై ఉండాలి. దీని తరువాత ఏడాది పాటు అప్రెంటిస్​గా పనిచేసి ఉండాలి. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఏడాది పాటు పనిచేసిన అనుభవం కూడా తప్పనిసరి. అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే ఆయా కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులు ఇస్తారు. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 16లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అభ్యర్థులు https://www.ecil.co.in/ వెబ్​సైట్‌ను చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

అభ్యర్థులను ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్‌తో పాటు ఎక్స్​పీరియన్స్​ ఆధారంగా ఈసీఐఎల్ జాబ్స్ కోసం షార్ట్ లిస్ట్(1100 Jobs) చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​ చేసి, అర్హులైన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు. జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.22,528 చొప్పున జీతం ఇస్తారు. దీనితోపాటు మెడికల్ ఇన్సూరెన్స్​, పీఎఫ్​, టీఏ/ డీఏ, పెయిడ్ లీవ్స్ లాంటి పలు బెనిఫిట్స్ కూడా అందిస్తారు. అభ్యర్థులు నాలుగు నెలలపాటు కాంట్రాక్ట్​ ప్రాతిపదికన జూనియర్ టెక్నీషియన్​లుగా పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 2024 జనవరి 16.

Also Read: Sunil Kanugolu : సునీల్ కనుగోలుకు కాంగ్రెస్ కొత్త బాధ్యతలు.. లోక్‌సభ పోల్స్‌ టీమ్‌కు దూరం ?

అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఉద్యోగ నియామకాలు 16 శాతం మేర తగ్గినట్లు నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌లో వెల్లడైంది. ఐటీ, బీపీవో, విద్య, రిటైల్, హెల్త్‌కేర్‌ రంగాల్లో నియామకాల పట్ల అప్రమత్త ధోరణే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ‘2023 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్‌ నెలలో కార్యాలయ ఉద్యోగ నియామకాలు 2 శాతం పెరిగాయి. ఐటీయేతర రంగాల్లో నియామకాలు ఇందుకు అనుకూలించాయి. నౌకరీ జాబ్‌ స్పీక్‌ సూచీ 16 శాతం తగ్గిపోవడానికి ఐటీ రంగమే ఎక్కువ ప్రభావం చూపించింది. ఐటీలో నియామకాలు పూర్తి స్థాయిలో సాధారణ స్థాయికి చేరుకునేందుకు ఎక్కువ కాలమే వేచి చూడాల్సి రావచ్చు’ అని నౌకరీ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ పవన్‌ గోయల్‌ వెల్లడించారు. కాగా భారతీయ ఐటీ రంగంలో నియామకాలు 2022 డిసెంబర్‌లో 21 శాతం క్షీణించాయి. నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌ డిసెంబర్‌ నెల గణాంకాల ప్రకారం.. బీపీవో రంగంలో (వార్షికంగా క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు) నియామకాలు 17 శాతం తగ్గాయి. విద్యా రంగంలో 11 శాతం, రిటైల్‌లో 11 శాతం, హెల్త్‌కేర్‌లో 10 శాతం చొప్పున తగ్గాయి. ఐటీ రంగంలో నియామకాలు ఏకంగా 21 శాతం పడిపోయాయి. క్రితం ఏడాది నవంబర్‌తో పోల్చి చూసినప్పుడు ఐటీ నియామకాలు 4 శాతం తగ్గాయి.