110 Voters : బిహార్‌కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే. వీరంతా జూన్ 1న జరగనున్న తుది విడత పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్పెషల్ ఫ్యామిలీ పాట్నా నగరంలో ఉంది. ఈ 165 మంది కలిసి నివసించే మెగా ఇంటి పేరు ‘చందేల్ నివాస్’ . ఈ ఫ్యామిలీలో కొత్తగా 10మందికి ఓటు హక్కు వచ్చింది. వీరిలో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. పట్నాలోని రెండు పోలింగ్ కేంద్రాల్లో ఈ కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కుటుంబం పెద్దది కావడంతో ఓట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వీరి ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా అభ్యర్థులు ఎవరూ తమ ఇంటికి రాలేదని సీనియర్ కుటుంబ సభ్యుడు 74 ఏళ్ల అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. అభ్యర్థుల స్థానిక అనుచరులు వస్తారని ఆయన వెల్లడించారు. మే 31న కుటుంబంలోని సభ్యులమంతా సమావేశమై అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.
We’re now on WhatsApp. Click to Join
ఈ ఫ్యామిలీ నేపథ్యం ఇదీ..
- అరుణ్ కుమార్ సింగ్ తండ్రి వైశాలి జిల్లాలోని రాఘోపూర్ వాస్తవ్యులు. అరుణ్ తండ్రికి ఓ సోదరుడు ఉన్నారు. వారిద్దరూ వ్యవసాయం చేసేవారు.
- గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేసి.. 1974లో సోదరులిద్దరూ కలిసి పాట్నా నగరానికి వచ్చేశారు.
- పాట్నాలో ఇద్దరూ కలిసి స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. వారిద్దరి సంతానమే ఇప్పుడు చందేల్ నివాసంలో ఉంటోంది.
- ఈ ఫ్యామిలీలో మొత్తం 165 మంది(110 Voters) ఉండగా.. 35మంది ఇంటికి దూరంగా ఉన్నారు. ఉద్యోగాల నిమిత్తం కొందరు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉంటున్నారు.
- ఈ ఫ్యామిలీలో 24మంది ఇంజినీర్లు ఉన్నారు.
- ఈ ఫ్యామిలీలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు లాయర్లు ఉన్నారు.
- ఈ ఫ్యామిలీలో 20మందికి పైగా కార్పొరేట్ ఉద్యోగాలు ఉన్నారు.