Site icon HashtagU Telugu

Maharashtra: నాసిక్ బస్సు ప్రమాద ఘటనలో చిన్నారి సహా 11మంది సజీవదహనం..!!

Maha

Maha

మహారాష్ట్రలో ఘోరం జరిగింది. నాసిక్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు రెస్య్కూటీం మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 11మంది సజీవదహనం అయ్యారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మొదట 9మంది మరణించినట్లు పోలీసులు తెలిపినప్పటికీ…బస్సులో నుంచి శవాలను బయటకు తీయడంతో..సంఖ్య 11కు చేరింది. నాసిక్ ఔరంగాబాద్ హైవేపై తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించరు. అయితే ఇప్పటికీ మరణించినవారి సంఖ్యపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం…యవత్మాల్ నుంచి ముంబయి కి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు..ట్రక్కును ఢీకొట్టింది. అతివేగంతో అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టింది. బస్సు 50 నుంచి 60 అడుగుల ముందుకు పడిపోవడంతో డీజిల్ ట్యాంక్ పగిలింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. కొంతమంది ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు బస్సులో నుంచి దూకేందుకు ప్రయత్నం చేశారు. డోర్ నుంచి కొందరు…కిటికీల్లోనుంచి కొందరు దూకడంతో వారికి గాయాలయ్యాయి. అందరు చూస్తుండగానే పెద్దెత్తున మంటలు చెలరేగాయి. కొంతమంది బయటకు రాలేక లోపలే చిక్కుకున్నారు. వారంతా మంటల్లో కాలి బూడిదయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 నుంచి 50మంది ఉన్నారని పోలీసులు తెలిపారు.