10th Cheetah Died : మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుత మృతిచెందింది. ఈ పార్కులో చనిపోయిన చిరుత పదోది. చనిపోయిన చీతా పేరు ‘శౌర్య’. దీన్ని నమీబియా నుంచి తెచ్చారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకే అటవీశాఖ ట్రాకింగ్ టీమ్.. ఆ చీతా బలహీనంగా నడుస్తుండటాన్ని గుర్తించింది. ఆ తర్వాత దానికి సీపీఆర్ చేసినా స్పందించలేదు. చికిత్సపొందుతూ కొన్ని గంటల్లోనే చిరుత శౌర్య చనిపోయింది. పోస్ట్‌మార్టం చేసిన తర్వాత చిరుత మరణానికి కారణమేంటో తెలుస్తుంది. 2022, 2023 సంవత్సరాల్లో విదేశాల నుంచి 20 పులులను కునో పార్క్‌కు తీసుకొచ్చారు. 2022 సంవత్సరంలో నమీబియా నుంచి, 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికా నుంచి చిరుతలను తెచ్చారు. ఇప్పటివరకు కునో నేషనల్ పార్కులో ఏడు పెద్ద పులులు, మూడు పులి కూనలు ప్రాణాలు కోల్పోయాయి. అవన్నీ అంటువ్యాధుల కారణంగా చనిపోయాయని మెడికల్ రిపోర్టుల్లో వెల్లడైంది. కునోలో పులి చివరి(తొమ్మిదో) మరణం గత ఏడాది ఆగస్టు 2న నమోదైంది. ఈ పార్కులో చివరిసారిగా సంభవించిన రెండు పులుల మరణాలకు కీటకాల వల్ల కలిగిన ఇన్ఫెక్షనే కారణమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల గుంపును కునోలోని ఎన్‌క్లోజర్‌లోకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేశారు. ఈ పార్క్‌లో నాలుగు పులి పిల్లలు(10th Cheetah Died) పుట్టాయి.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో ఇలా..
తెలంగాణలో ఇటీవల రెండు పులులు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాయి. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతంలో జనవరి 7న ఒక ఆడపులి చనిపోయినట్లుగా గుర్తించామని తెలంగాణ అటవీ అధికారులు తెలిపారు. ఆ తరువాత జనవరి 9న మగ పులి కళేబరం కనిపించిందని చెప్పారు. ఇది ఆడపులి మృతదేహానికి సమీపంలోనే కనిపించింది. ఇలా కవ్వాల్ పులుల అభయారణ్యంలో వరుసగా పులులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: Shahi Idgah Complex : శ్రీకృష్ణ జన్మభూమి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఆ సర్వేపై స్టే
మహారాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్ జిల్లా పులుల సంచారానికి ప్రధాన కేంద్రంగా ఉంటోంది. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తాడోబా టైగర్ రిజర్వుల నుంచి పెన్ గంగా, పెద్దవాగు, ప్రాణహిత మీదుగా పులులు కవ్వాల్ రిజర్వ్ అటవీప్రాంతంలోకి వస్తూపోతుంటాయి.ఇలా వచ్చిన ఒక పులుల జంట, వాటికి పుట్టిన నాలుగు పిల్లలు కొంతకాలంగా కాగజ్ నగర్ అటవీ రేంజ్ పరిధిలో సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.వీటిలో రెండు పులులు దరిగాం, సర్కెపల్లి అటవీ ప్రాంతాల నడుమ జనవరి మొదటి వారంలో చనిపోయి కనిపించాయి.చనిపోయిన వాటిలో మగ పెద్దపులి, ఆడ పులి పిల్ల ఉన్నాయి. టెరిటరీ (నిర్దిష్ట ప్రాంతం) కోసం పులుల మధ్య జరిగిన గొడవల్లో ఆడ పులిపిల్ల చనిపోయిందని అధికారులు తెలిపారు. విష ప్రయోగం వల్ల మగపులి చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు వచ్చేంతవరకూ నిర్ధరణకు రాలేమని తెలంగాణ ఫారెస్ట్ శాఖ పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియాల్ మీడియాతో చెప్పారు.