Site icon HashtagU Telugu

Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు

New Web Story Copy 2023 08 14t100317.813

New Web Story Copy 2023 08 14t100317.813

Independence Day 2023: రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యట్లేదు. రేపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు జరగనున్నాయి. ప్రతి ఏడాది ఎర్రకోటలో ప్రధాని మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. ఈ నేపథ్యంలో కేంద్ర భద్రత బలగాలు ఎర్రకోటను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 1,000 ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలు, యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు మరియు 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని (10,000 Cops) ఏర్పాటు చేశారు. రేపు ఉదయం ఎర్రకోటలో ప్రధాని మోడీ (PM Modi) త్రివర్ణ పతాకం ఎగరేసి జాతిని ఉద్దేశించి ప్రసంగింస్తారు. గతంలో కోవిడ్ ఆంక్షల మధ్య వేడుకలు జరిగాయి. రెండు సంవత్సరాల తర్వాత కరోనా ఆంక్షలు లేకపోవడంతో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు.

హర్యానా అల్లర్ల నేపథ్యం కూడా ఉండటంతో పోలీసులు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని భద్రత విషయంలో రాజీ పడటం లేదు. భద్రతా ఏర్పాట్లపై స్పెషల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ దేవేంద్ర పాఠక్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కరోనా ఆంక్షలు లేకపోవడంతో పరిమితులు లేకుండా స్వాతంత్ర వేడుకలు జరుపుతున్నామని అన్నారు. అందువల్ల పోలీసుల పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇతర ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. ఢిల్లీ పోలీసులు సాంకేతిక వ్యవస్థలను కూడా ఉపయోగించనున్నారు. రిహార్సల్స్ చేస్తున్నామని చెప్పారు.

ఎర్రకోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ పథకం లబ్ధిదారులతో సహా దాదాపు 1,800 మంది ప్రత్యేక అతిథులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో 20 వేల మందికి పైగా అధికారులు, పౌరులు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతకు ఏర్పాట్లు జరిగాయి. విశేషం ఏంటంటే మొఘల్ కాలం నాటి భద్రతను ఎర్రకోటకు ఈ ఏడాది ప్రవేశపెట్టినట్లు అధికారులు చెప్తున్నారు.

సరిహద్దుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు, దేశ రాజధానిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. స్వాతంత్ర వేడుకలు పూర్తయ్యే వరకు ఎర్రకోట పరిసర ప్రాంతాలను “నో కైట్ ఫ్లయింగ్ జోన్”గా మార్చారు. ఎర్రకోట సమీపంలోని ప్రాంతాల నివాసితులు ఈవెంట్ పూర్తయ్యే వరకు గాలిపటాలు ఎగురవేయవద్దని పోలీసులు కోరారు. 2017లో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా పోడియం వద్ద గాలిపటం వచ్చింది. అయినా ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాజ్‌ఘాట్, ఐటీఓ, ఎర్రకోట వంటి ప్రాంతాల్లో సీఆర్‌పీసీ సెక్షన్ 144 అమలు చేశారు.

Also Read: Three Foreign Women : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ముగ్గురు బ్రిటీష్ మహిళలు.. ఎవరు ?