Mumbai: శ్మశానంలో పుట్టినరోజు, వెయ్యిమంది అతిథులు, బిర్యానీ, కేక్ వడ్డన..!!

  • Written By:
  • Publish Date - November 24, 2022 / 11:10 AM IST

సాధారణ పుట్టినరోజు వేడుకలు ఎక్కడ జరుపుకుంటారు. ఇంట్లో లేదా దేవాలయంలో లేదా ఏదైనా ఫంక్షన్ హాల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ శ్మశానంలో పుట్టిన రోజు జరుపుకుంటే ఎలా ఉంటుంది. ఎప్పుడు ఇలా ఆలోచించారా మీరు. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నప్పటికీ…మహారాష్ట్రలోని థానేలో ఇదే జరిగింది. ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకను శ్మశానంలో ఘనంగా జరుపుకున్నాడు. ఆయన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది.

పూర్తి వివరాలు ప్రకారం…థానే జిల్లాలోని కల్యాణ్ పట్టణంలో గౌతమ్ రతన్ మోర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతని 54వ పుట్టినరోజు వేడుకలను శ్మశాన వాటికలో జరుపుకున్నాడు. నవంబర్ 19న మోహ్నే శ్మశాన వాటికలో గ్రాండ్ గా పార్టీని ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చిన అతిథులకు కేక్, బిర్యానీ వడ్డించాడు. ఈ బర్త్ డే వేడుకకు 100మందికి పైగా అతిథులు వచ్చారు. పిల్లల నుంచి పెద్దల వరకు హాజరయ్యారు.

శ్మశానంలో పుట్టిన రోజు ఎందుకు జరుపుకున్నాడనే అనుమానం రావచ్చు. దీనికి ఓ కారణం ఉంది. ప్రఖ్యాత సామాజిక కార్యకర్త సింధుతాయ్ సప్కల్ , చేతబడి, మూడనమ్మకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేసేవారు. ఆయన నుంచి మోర్ ప్రేరణ పొందినట్లు చెప్పారు. శ్మశానంలో దెయ్యాలు ఉండవనే సందేశం ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేసినట్లుగా చెప్పారు. మోర్ పుట్టినరోజు వేడుక నేపథ్యంలో పెద్ద బ్యానర్, కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.