Site icon HashtagU Telugu

Anti Cheating Bill : అక్రమార్కులకు ఖబడ్దార్.. లోక్‌సభలోకి ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌’ బిల్లు

Anti Cheating Bill

Anti Cheating Bill

Anti Cheating Bill : పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్‌ వంటి బాగోతాలు ఉద్యోగ పరీక్షలు, విద్యార్హత పరీక్షల్లో పెచ్చుమీరుతున్నాయి. తెలంగాణ, రాజస్థాన్,  హర్యానా, గుజరాత్‌, బిహార్‌ సహా పలు రాష్ట్రాల్లో గతేడాది ఈవిధమైన వ్యవహారాలు దుమారం రేపాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్వహించే అన్ని రకాల పరీక్షల్లో అవకతవకలకు చెక్ పెట్టేందుకు మోడీ సర్కారు నడుం బిగించింది. తాజాగా సోమవారం ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును సభలోకి ఇంట్రడ్యూస్ చేశారు. లోక్‌సభ, రాజ్యసభల ఆమోదం పొంది ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే.. పేపరు లీకేజీకి పాల్పడినా, మాల్‌ ప్రాక్టీస్‌ చేసినా, నకిలీ వెబ్‌సైట్లను సృష్టించినా కనిష్ఠంగా మూడేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష పడుతుంది. రూ.కోటి వరకూ జరిమానా విధిస్తారు. ఈ బిల్లు పోటీ పరీక్షల్లో అవతవకలను క్రియేట్ చేసే వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులనూ శిక్షించే ప్రతిపాదనలు ‘పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024’లో( Anti Cheating Bill) ఉన్నాయి. ప్రస్తుతం ఈ నేరాలకు చట్టంలో ఎటువంటి శిక్షలు లేవు. కొత్త బిల్లు యూపీఎస్సీ, ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, ఐబీపీఎస్‌, ఎన్‌టీఏ వంటి పోటీ పరీక్షలతోపాటు నీట్‌, జేఈఈ, సీయూఈటీ వంటి ప్రవేశ పరీక్షలకూ వర్తిస్తుంది.

We’re now on WhatsApp. Click to Join

బిల్లులోని ప్రపోజల్స్ ఇవీ..

Also Read : Bharat Rice : ‘భారత్‌ రైస్’ సేల్స్ నేటి నుంచే.. రూ.29కే కేజీ సన్నబియ్యం.. ఇలా కొనేయండి