Site icon HashtagU Telugu

Supreme Court: EWS రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు.!

Group 1 Exam Supreme Court TSPSC TGPSC Telangana

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీం కోర్టు సమర్ధించింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం రెండు వేర్వేరు తీర్పులను వెల్లడించింది. దీంట్లో ముగ్గురు జడ్జిలు రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునిచ్చారు. 103వ రాజ్యంగ సవరణ ద్వారా ఇటీవల కేంద్ర ప్రభుత్వం EWS రిజర్వేషన్లను కల్పించింది. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ తీర్పు వెలువరించింది.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన పేదలకు లేదా EWS (ఆర్థికంగా బలహీన వర్గాలు) కోసం కాలేజీలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం కోటాను సోమవారం సుప్రీంకోర్టు సమర్థించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) 10 శాతం రిజర్వేషన్లకు సంబంధించి 103వ రాజ్యాంగ సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ యూయూ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో నలుగురు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్ధించారు. ఇది చట్టాన్ని ఉల్లంఘించనట్లు అవదని వారు అభిప్రాయపడ్డారు.

EWS కోటా అమలు కోసం కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ చేపట్టి రిజర్వేషన్లను అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఈ మేరకు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల్లో కూడా పేదలు ఉన్నారని, అలాంటప్పుడు సాధారణ కేటగిరీ వారికి మాత్రమే ఎందుకు రిజర్వేషన్లు కల్పిస్తారని పిటిషన్‌లో ప్రశ్నించారు. దీనిపై విచారణ సందర్భంగా సుప్రీం ఈ కీలక తీర్పు సోమవారం వెలువరించింది.