Bihar: వడదెబ్బతో 10 మంది ఎన్నికల సిబ్బంది మృతి

బీహార్‌లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్‌స్ట్రోక్‌తో మరణించారు

Bihar: బీహార్‌లో గత 24 గంటల్లో వడదెబ్బ కారణంగా 10 మంది పోలింగ్ సిబ్బంది సహా 14 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల విధుల్లో ఉన్న ఐదుగురు అధికారులు హీట్‌స్ట్రోక్‌తో మరణించారు. అయితే భోజ్‌పూర్‌లో ఎక్కువ మరణాలు నమోదయ్యాయని సంబంధితా శాఖ అధికారులు తెలిపారు. రోహ్తాస్‌లో ముగ్గురు ఎన్నికల అధికారులు మరణించగా, కైమూర్ మరియు ఔరంగాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరో నలుగురు వ్యక్తులు మరణించారని పేర్కొంది. అయితే మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ప్రకటనలో తెలిపారు.

బీహార్ రాష్ట్రంలో ఎండ వేడిమికి ప్రజలు అల్లలాడిపోతున్నారు. 44 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో రాష్ట్రం ఉక్కపోతతో అల్లాడిపోతోంది. గురువారం బక్సర్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.వేడిగాలుల కారణంగా జూన్ 8 వరకు అన్ని పాఠశాలలు, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు అంగన్‌వాడీ కేంద్రాలు మూసివేశారు.

బీహార్ లో వేడి పరిస్థితిపై ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ ఎక్స్ ద్వారా స్పదించాడు. ప్రతిపక్షాల ఒత్తిడి కారణంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడినప్పుడు, ఈ తీవ్రమైన వేడి పరిస్థితుల్లో ఉపాధ్యాయులను పాఠశాలలకు ఎందుకు రమ్మని అడుగుతున్నారు? విద్యార్థులు పాఠశాలలో లేనప్పుడు ఉపాధ్యాయులు ఏమి చేస్తారు? ఈ ఎండవేడిమిలో ఉపాధ్యాయులకు సెలవు ఇవ్వాలని ఆయన నితీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్కాగా 40 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరగగా, శనివారం ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది.

Also Read; Lok Sabha Elections 2024: ఎన్నికల నామినేషన్ తిరస్కరణ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం