Ratan Tata Quotes : రతన్ టాటా (86) ఇక లేరు. ఆయన ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించారు. ఇతరులను గౌరవించడం, నైతిక విలువలకు కట్టుబడి ఉండటం అనే విషయంలో రతన్ టాటాను మించిన వారు లేరు. అందుకే ఆయనను చాలామంది ‘సెక్యులర్ లివింగ్ సెయింట్’గా (Ratan Tata Quotes) చెబుతారు. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ఆరు ఖండాలలోని 100 దేశాలకు ఆయన విస్తరించారు. ఇంత పెద్ద వ్యాపారాలను నిర్వహించినా రతన్ టాటా చాలా అణకువగా వ్యవహరించారు. చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. ఆయన దాతృత్వ కార్యకలాపాలతో 21వ శతాబ్దపు యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలిచారు. రతన్ టాటా వివిధ ప్రసంగాల్లో చెప్పిన ప్రముఖ సూక్తులను ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Ratan Tata : రతన్ టాటాకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఇవాళ మహారాష్ట్రలో సంతాప దినం
రతన్ టాటా గొప్ప సూక్తులు
- ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ దాని స్వంత తుప్పే నాశనం చేయగలదు. అలాగే, ఎవరూ ఒక వ్యక్తిని నాశనం చేయలేరు కానీ వారి సొంత ఆలోచనా విధానమే అలా చేయగలదు.
- ప్రజలు మీపై విసిరే రాళ్లను తీసుకోండి. వాటిని స్మారక చిహ్నంగా నిర్మించడానికి ఉపయోగించండి.
- మనల్ని కొనసాగించడానికి జీవితంలో హెచ్చు తగ్గులు చాలా ముఖ్యమైనవి.. ఎందుకంటే ఈసీజీలో సరళ రేఖ వచ్చిందంటే మనం సజీవంగా లేమని అర్థం.
- మీరు వేగంగా నడవాలనుకుంటే.. ఒంటరిగా నడవండి. కానీ మీరు చాలా దూరం నడవాలనుకుంటే మాత్రం కలిసి నడవండి.
- నాయకత్వం అంటే ఇన్‌ఛార్జ్‌గా ఉండటం కాదు. మీ బాధ్యతలో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడమే నిజమైన నాయకత్వం.
- సానుభూతి, దయ ఒక నాయకుడికి గొప్ప బలాలు.
- విజయం అనేది మీరు కలిగి ఉన్న స్థానాన్ని బట్టి కాదు.. ఇతరులపై మీరు చూపే ప్రభావాన్ని బట్టి అంచనా వేయబడుతుంది.
- సక్సెస్‌ను అదృష్టానికి వదిలివేయడాన్ని నేను నమ్మను. నేను విజయం కోసం కేవలం హార్డ్ వర్క్, ప్రిపరేషన్‌లను నమ్ముకుంటాను.
- సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు నమ్మకం లేదు. నేను తొలుత నిర్ణయాలు తీసుకుంటాను. ఆ తర్వాత క్రమంగా వాటిని సరిచేస్తాను.
- నా కోసం నేను ఏమీ చేయలేని రోజు.. నా బ్యాగ్‌లు సర్దుకుని బయలుదేరే రోజుకు సూచిక.