ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా, పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని నింపింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ మద్దతిచ్చినట్లు తెలుస్తుండగా, భారతీయులంతా ఆగ్రహంతో ఊగిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చేందుకు భారత్ సైన్యం మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరిట మెరుపుదాడి చేపట్టి కేవలం 23 నిమిషాల్లో దాడిని విజయవంతంగా ముగించింది. ఈ ఆపరేషన్‌లో స్కాల్ప్ క్షిపణులు, హమార్ బాంబులు, కామికాజీ డ్రోన్లను వినియోగించి గమ్యాలను సమర్థంగా ధ్వంసం చేశారు.
Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రెడ్ అలర్ట్
ఈ ప్రతీకార దాడిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి (Masood Azhar Family) చెందిన 10 మంది మృతి చెందారు. ఈ దాడి ప్రధానంగా పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్‌లో ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలను భారత్ ధ్వంసం చేయడం ద్వారా తీవ్ర ఉగ్రనివారణ చర్యలు తీసుకుంది. ఈ విజయవంతమైన దాడికి భారత్ పలు అంతర్జాతీయ దేశాలు అమెరికా, రష్యా, యుకె, సౌదీ అరేబియా లకు వివరణనిచ్చింది. భారత్ ఉగ్రవాదంపై ఎంతమాత్రం సంధించబోదని మరోసారి స్పష్టం చేసింది.
ఈ దాడులకు స్పందనగా పాకిస్థాన్ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం ప్రారంభించింది. భారత్ సైన్యానికి చెందిన రెండు స్థావరాలను తామూ ధ్వంసం చేశామని వదంతులు పుట్టించగా, భారత ప్రభుత్వం ఆ వీడియోలు పాతవేనని, ఖైబర్ పఖ్తుంఖ్వా, ఐర్లాండ్ ప్రాంతాలకు సంబంధించినవని ‘ఫ్యాక్ట్ చెక్’ ద్వారా తేల్చిచెప్పింది. ఈ వ్యవహారం భారత సైన్యం మానసిక స్థైర్యం, సమాచార స్పష్టతను మరోసారి రుజువు చేసింది.