Site icon HashtagU Telugu

Chhattisgarh : మావోయిస్టుల ఘాతకం..10 మంది జ‌వాన్లు మృతి

10 jawans killed in landmine blast in Chhattisgarh

10 jawans killed in landmine blast in Chhattisgarh

Chhattisgarh : ఛత్తీస్ గడ్‌ బీజాపూర్ జిల్లా భేద్రే కుట్రు ర‌హ‌దారిలో జ‌వాన్ల వాహ‌నాన్ని ల‌క్ష్యంగా చేసుకుని మావోయిస్టుల‌కు పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. ఈ ప్రమాదంలో 10 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ముగ్గురు జ‌వాన్ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 15 మంది వరకు ఆర్మీ సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పేలుడు జ‌రిగిన ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్ చేప‌ట్టారు. కాగా, గత కొన్నాళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌, సుకుమా జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుంది. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాల మధ్య తరచూ కాల్పులు చోటు చేసుకుంటున్నాయి.

కాగా, 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం అంతం చేస్తామని ఇటీవల కేంద్ర హోమంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో మావోయిస్టుల హింస, భావజాలాన్ని నిర్మూలించి శాంతిని నెలకొల్పాలని ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయించుకున్నారని అమిత్‌షా చెప్పారు. మావోయిస్టులు ఒకప్పుడు పశుపతినాథ్‌ (నేపాల్‌) నుంచి తిరుపతి వరకు కారిడార్‌ ఏర్పాటు చేయాలని భావించారని కానీ, మోడీ నేతృత్వంలో దాన్ని ధ్వంసం చేశామన్నారు. ఈసందర్భంగా హింసను, ఆయుధాలను వదిలేసి లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే మావోయిస్టుల అంతానికి ఆల్‌- అవుట్‌ ఆపరేషన్‌ నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Read Also: Shriya Saran Dance Viral : ఆ నడుముకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..