Site icon HashtagU Telugu

1 Dead, 3 Injured: కుప్పకూలిన బిల్డింగ్.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు

Indian Student Dies In US

Crime Imresizer

ఉత్తర ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో శనివారం నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్, మెట్లు కూలిపోవడంతో 35 ఏళ్ల వ్యక్తి మరణించగా, ముగ్గురు గాయపడినట్లు (1 Dead, 3 Injured) అధికారులు తెలిపారు. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సాయంత్రం 6.28 గంటలకు సంఘటన గురించి తమకు సమాచారం అందిందని, వెంటనే రెండు ఫైర్ టెండర్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు.

కుతుబ్ రోడ్ ప్రాంతంలోని ఒక లోదుస్తుల దుకాణంలో మెట్లు కూలిపోవడంతో అకస్మాత్తుగా శబ్దం, ధూళి సంభవించిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వ్యక్తిని హిందూరావు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి తెలిపారు. బాధితుడిని బీహార్‌లోని సీతామర్హి నివాసి గులాబ్‌గా గుర్తించారు.

Also Read: Former MLA Arrested: మాజీ ఎమ్మెల్యే అరెస్టు.. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. పేలుడు లాంటి శబ్దంతో కూలిపోవడంతో ప్రజలు అక్కడి నుండి పరుగులు తీశారు. హర్జీత్ సింగ్ ఛబారా అనే మరో సాక్షి మాట్లాడుతూ.. ‘ఒక్క సారిగా పెద్ద శబ్దం వచ్చింది. కానీ దానికి కారణం స్పష్టంగా తెలియలేదు. నా షాప్ పక్కనే ఉన్న బిల్డింగ్ లో ఇది జరిగింది. కొంత సమయం తరువాత పొగ వచ్చింది’ అని పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి సమీపంలోని ఒక ప్రదేశంలోని సిసిటివి ఫుటేజీలో ఈ ప్రమాదం తరువాత జరిగిన పరిణామాలు రికార్డు అయ్యాయి. బిల్డింగ్ నుంచి దూళి రావడం, అక్కడి నుంచి ప్రజలు పారిపోవడం వంటి దృష్యాలు సిసిటివి ఫుటేజీలో కనిపిస్తున్నాయి.