Etela Vs KCR : కేసీఆర్, ఈటెల ‘కేస్’ స్టడీ

హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసుల వైపు రాజకీయం మళ్లింది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 12:59 PM IST

హుజురాబాద్ ఉపఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కేసుల వైపు రాజకీయం మళ్లింది. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు అంటున్నారు. అదే సమయంలో ఈటెల రాజేంద్ర పై ఉన్న అసైన్డ్ భూముల ఆక్రమణ కేసు ను తెలంగాణ ప్రభుత్వం బయటకు తీసింది. కేసీఆర్ అవినీతి మీద సీబీఐ కి ఫిర్యాదు చేస్తామని బీజేపీ చెబుతుంది. కేసులకు, ఈడీ, సీబీఐ లకు బయపడం అంటూ కేసీఆర్ మీడియా ముఖంగా పదే పదే చెప్పటం వెనుక ఏదో జరుగుతుఉందనే అనుమానాలకు తావిస్తోంది.

Also Read :తెలంగాణాలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది!

గతంలో ఓటుకు నోటు కేసు సమయంలో కూడా ఇలాగే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏసీబీ చేత రేవంత్ పై కేసు నమోదు చేసి చంద్రబాబును టార్గెట్ చేసింది. ప్రతిగా ఫోన్ ట్యాపింగ్ కేసును ఏపీ పోలీసులు తెలంగాణ అధికారులపై పెట్టింది. చివరకు రెండు కేసులు ఏమయ్యాయో మనకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ పైన బీజేపీ కేసులు, ఈటెల పై తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టడం టిట్ ఫర్ టా ట్ లా ఉంది.
హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈటల రాజేందర్‌పై మెదక్ జిల్లా అధికారులు మళ్లీ విరుచుకుపడ్డారు. రాజేందర్ భార్య జమున హేచరీస్‌ ఉన్న భూములను సర్వే చేయాలని మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. 100 మంది రైతులకు నోటీసులు కూడా అందించారు. జూన్‌లో మెదక్ జిల్లా మాసాయిపేట మండలం జమున హాట్‌చెరీస్‌కు చెందిన అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో అసైన్డ్ భూములు, సీలింగ్ భూముల సర్వే చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తమ ఆధీనంలో ఉన్న భూమిని సర్వే చేయడాన్ని ప్రశ్నిస్తూ హేచరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నోటీసు జారీ చేసిన తర్వాతే సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ ప్రకారం, కోవిడ్ కారణంగా అధికారులు సర్వే చేయలేకపోయారు. ఇప్పుడు తగిన విధానాన్ని అనుసరించి భూములను సర్వే చేయాలని నిర్ణయించుకున్నారు.సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ హేచరీస్ యజమానులకు, సుమారు 100 మంది రైతులకు నోటీసులు జారీ చేశారు. సంబంధిత భూములు అసైన్డ్ భూములా లేక సీలింగ్ భూములా అనేది పక్కాగా సర్వే చేసిన తర్వాతే తెలుస్తుందని చెప్పారు.

Also Read :పక్కా స్కెచ్ తోనే కేసీఆర్ ప్రెస్ మీట్స్

నవంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు రెండు గ్రామాల్లో భూ సర్వే ఉంటుందని కలెక్టర్ వివరించారు. జమున హేచరీస్ ఉన్న స్థలంలో కొత్త సర్వే చేయడం లేదని, ఇంతకు ముందు ఆపివేసిన సర్వేను మాత్రమే కొనసాగిస్తున్నామని ” అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జమున హేచరీస్‌పై ACB మరియు విజిలెన్స్ విచారణలను ప్రారంభించింది. గతంలో కూడా విజిలెన్స్ అధికారులు కొంతమంది రైతులను విచారించి ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ ఉప పలితాలు వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఈటెల కోసం రంగంలోకి దిగింది.టచ్ చేసి చూడండి అని బీజేపీ నేతలు కేసీఆర్ వార్నింగ్ ఇచ్చాడు. జైలుకు పంపించే దమ్ము ఉందా అంటూ విరుచుకు పడ్డాడు. బీజేపీ తెలంగాణ నేతలపై కేసీఆర్ దూకుడుగా వెళ్తున్నాడు. అలాంటి దూకుడును ఈటెల మీద మరింత ఎక్కువగా ప్రదర్శిస్తున్నాడు. బీజేపీ నేతల ఆరోపణలకు కళ్లెం వేయడానికి ఇలా చేస్తున్నాడా? లేక కేసుకు..కేసు నమూనా లో కేసీఆర్ వెళ్తున్నాడా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.