ఆమ్మో… మళ్ళీ కొత్త వేరియెంటా

కరోనా ఇప్పట్లో వదిలే సమస్య కాదని కొందరు వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పినట్టే జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - October 28, 2021 / 11:13 AM IST

కరోనా ఇప్పట్లో వదిలే సమస్య కాదని కొందరు వైద్యులు, శాస్త్రవేత్తలు చెప్పినట్టే జరుగుతోంది. కరోనా నుండి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి ఉంటే మరోవైపు కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తున్నాయి. చైనా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

తాజాగా బెంగళూరులో కూడా కరోనా కొత్త వేరియంట్ ని డాక్టర్లు గుర్తించారు. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 ఇప్పుడు ఇండియాను ఇబ్బంది పెడుతోంది.

కర్ణాటకలో ఇప్పటివరకూ ఇలాంటి కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు. ఇందులో మూడు కేసులు బెంగళూరులో నమోదు కాగా, మరో నాలుగు కేసులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదయినట్లు ఆయన తెలిపారు.
భారత్‌లో ఇప్పటివరకూ 17 Delta AY.4.2 కరోనా కేసులు నమోదయయ్యాయి. ఆరు రాష్ట్రాల్లో ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. ఈ శాంపిల్స్ అన్నీ మే, సెప్టెంబర్‌లో సేకరించినవిగా వైద్య శాఖ అధికారులు గుర్తించారు. ఈ కొత్త రకం కరోనా కేసులు నమోదవుతుండటం భారత్‌లో కరోనా థర్డ్ వేవ్‌కు సంకేతంగా భావిస్తున్నారు.

ఈ కొత్త వేరియంట్ వల్ల ఇప్పటివరకు ఎవరూ చనిపోలేదు కానీ స్ప్రెడింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉండడమే కాస్త ఆందోళన పడాల్సిన అంశం.

కరోనాతో పరిస్థితులు తలకిందై ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయనుకుంటే కొత్త వేరియంట్స్ మళ్ళీ పాతరోజుల్లోకే తీసుకెల్తాయా అనే సందేహం వస్తోంది. ఏదేమైనా డాక్టర్లు చెప్పిన సూచనలు, సలహలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండడమే మనం చేయగలిగే పని.