Revanth Reddy: సీనియ‌ర్ల ప‌ద్మ వ్యూహంలో రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి చూట్టూ కాంగ్రెస్ పెద్ద‌లు గూడు అల్లుతున్నారు. ఆయ‌న చేత‌గానిత‌నం కార‌ణంగానే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా కాంగ్రెస్ పోయింద‌ని గ‌ళమెత్తారు. గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ వాడివేడిగా జ‌రిగింది.

  • Written By:
  • Updated On - November 4, 2021 / 12:24 AM IST

రేవంత్ రెడ్డి చూట్టూ కాంగ్రెస్ పెద్ద‌లు గూడు అల్లుతున్నారు. ఆయ‌న చేత‌గానిత‌నం కార‌ణంగానే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా కాంగ్రెస్ పోయింద‌ని గ‌ళమెత్తారు. గాంధీభ‌వ‌న్లో జ‌రిగిన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ వాడివేడిగా జ‌రిగింది. సీనియ‌ర్లు కోమ‌టిరెడ్డి, జ‌గ్గారెడ్డి, ఉత్త‌మ్..త‌దిత‌రులు ఆ మీటింగ్ కు రాలేదు. అయిష్టంగా జానారెడ్డి స‌మావేశానికి హాజ‌ర‌య్యాడు. ఇక ఎలాంటి మీటింగ్ ల‌కు రానంటూ చెప్పేసి వెళ్లిపోయాడు. త‌న అవ‌స‌రం ఉన్న‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తాన‌ని సెటైర్ వేసి గాంధీభ‌వ‌న్ నుంచి వెళ్లిపోయాడు జానారెడ్డి.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డిని ఇప్ప‌టికీ సీనియ‌ర్లు అంగీక‌రించ‌డంలేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జ‌రిగిన తీరును చూస్తే, భ‌విష్య‌త్ లోనూ రేవంత్ తో క‌లిసి సీనియ‌ర్లు న‌డుస్తార‌న్న న‌మ్మ‌కం లేకుండా పోయింది. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్న ఠాకూర్ కూడా హుజూరాబాద్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై స్పందించాడు. కోమ‌టిరెడ్డి, జ‌గ్గారెడ్డి చేసిన కామెంట్ల‌కు విరుద్ధంగా ఠాకూర్ మాట్లాడారు. బీజేపీ పార్టీ విజ‌యానికి కాంగ్రెస్ ప‌నిచేసింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు అంటున్నారు. దాన్ని ఖండిస్తోన్న ఠాకూర్ హుజురాబాద్ ఫ‌లితం కాంగ్రెస్ త‌ప్పిందమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పీసీసీ చీఫ్ హోదాలో ఓట‌మికి తాను బాధ్య‌త వ‌హిస్తాన‌ని రేవంత్ ప్ర‌క‌టించాడు.

Also Read : ఈటలని గెలిపించిన పది సూత్రాలు ఇవే

పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ మీటింగ్ లో రేవంత్ రెడ్డి వాల‌కంపై చాలా మంది విరుచుకుప‌డిన‌ట్టు తెలిసింది. తొలి నుంచి హుజురాబాద్ ఎన్నిక గురించి ఉదాసీనంగా ఎందుకు వ్య‌వ‌హరించార‌ని రేవంత్ ను నిల‌దీశారు. చివ‌రి నిమిషం వ‌ర‌కు ఎందుకు అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌లేద‌ని సీనియ‌ర్లు ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లోని ఇత‌ర ప్రాంతాల్లో రోడ్ షోలు, ద‌ళిత‌, గిరిజ‌న దండోరా, జంగ్ సైర‌న్ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల ద్వారా ఏమి సాధించామ‌ని కాంగ్రెస్ పెద్ద‌లు రేవంత్ ను క‌డిగిపారేశార‌ని గాంధీభ‌వ‌న్ వ‌ర్గాల టాక్‌. ఇక నుంచైన స‌మ‌న్వ‌యంతో ముందుకు క‌ద‌ల‌క‌పోతే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌లో భూస్థాపితం అవుతుంద‌ని హెచ్చ‌రించిన‌ట్టు స‌మాచారం.హుజురాబాద్ ఓట‌మి క‌సిని పెంచింద‌ని మీడియాకు రేవంత్ చెబుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ లో మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌ని క్యాడ‌ర్ ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. డిపాజిట్ల‌కు కూడా చాలా దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితిని చూసి క్యాడ‌ర్ నిరూత్సాహంగా ఉంది. వాళ్ల‌లోని నైరాశ్యాన్ని పోగొట్టే ప్ర‌య‌త్నం రేవంత్ చేస్తున్నాడు. తెలంగాణ‌లోని ఇత‌ర ప్రాంతాల‌కు హుజురాబాద్ భిన్న‌మ‌నే విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం స‌ఫ‌లీకృతం కావ‌డంలేదు.

పీసీసీ చీఫ్ గా రేవంత్ ఏదో చేస్తాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కేవ‌లం ఆయ‌న హ‌డావుడి మీడియా, సోష‌ల్ మీడియా వ‌ర‌కు ప‌రిమిత‌మ‌ని హుజురాబాద్ కాంగ్రెస్ ఓట్లు చెబుతున్నాయి. ముందు నుంచి ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ పెద్ద‌లు చెబుతున్నారు. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కు ఫిర్యాదు చేయ‌డానికి సీనియ‌ర్లు క్యూ క‌ట్టార‌ని తెలిసింది. ఇప్ప‌టికే ప‌లు ఫిర్యాదులు రేవంత్ రెడ్డి మీద చేసిన సీనియ‌ర్లు ఇప్పుడు మ‌రింత ప‌దును పెడుతున్నారు.
ప‌నిలోప‌నిగా రూ. 25కోట్ల‌కు రేవంత్ రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయ‌డాని కౌశిక్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌ల‌ను కూడా జోడిస్తున్నారు. పీసీసీ ప‌దవిని 50కోట్లకు కొనుగోలు చేశాడ‌ని ఇంత కాలం రేవంత్ రెడ్డి మీద ప‌లువురు కాంగ్రెస్ సీనియ‌ర్లు బాహాటంగా ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఇప్పుడు హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల ఓట్ల‌ను చూపిస్తూ 25కోట్ల‌కు కాంగ్రెస్ పార్టీని బీజేపీకి అమ్మేశాడ‌నే ఆరోప‌ణ‌లు ఆయ‌న్ను ఇరుకున‌ పెడుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితి నుంచి రేవంత్ రెడ్డి బ‌య‌ట‌ప‌డి కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం పేతం చేయ‌డం పెద్ద స‌వాల్‌.

Also Read : వేటగాళ్ల చేతిలో చిక్కుతున్న పులులు..