Mouth And Cancer: నోటిని చూసి మీరు ఎంత ఆరోగ్యవంతులో చెప్పచ్చు.. ఎలా అంటే?

మనుషులకు నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నోరు ఆరోగ్యంగా లేకపోతే నోటి నుంచి దుర్భాషణ రావడంతో పాటు నాలుగు

  • Written By:
  • Publish Date - August 20, 2022 / 08:15 AM IST

మనుషులకు నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. నోరు ఆరోగ్యంగా లేకపోతే నోటి నుంచి దుర్భాషణ రావడంతో పాటు నాలుగు రంగు మారడం, చిగుల వాపు ఇలా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ నోటి ని పరీక్షించి భవిష్యత్తులో వచ్చే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలను ముందుగానే తెలుసుకోవచ్చు అని పరిశోధకులు అంటున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చిగుళ్లు: నోటిలో దంతాలను గట్టిగా ఉంచే చిగుళ్ల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అయితే చిగుళ్ళు పాలిపోయినట్టు ఉన్నా లేదంటే బ్రష్ చేసిన సమయంలో రక్తస్రావం అయింది అంటే అది చిగుళ్ళ వ్యాధికి సంకేతంగా భావించవచ్చు. అందుకు తగిన విధంగా చికిత్స కూడా తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం వల్ల అది ఇతర సమస్యలకు దారితీస్తుంది. అయితే చిగుళ్ల వ్యాధితో బాధపడే వారు, భవిష్యత్తులో గుండె జబ్బు, స్ట్రోక్ బారిన పడే రిస్క్ ఇతరులతో పోలిస్తే రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంటుందని హార్వర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు.

నాలుక: సహజంగా నాలుక పింక్ రంగులో ఉండి, పైన తెల్లటి లేయర్ పలుచగా ఉంటే అది సహజమే. అలా కాకుండా నాలుకపై కొంచెం ఎక్కువగా తెల్లటి కోటింగ్ ఉంది అంటే అది కేన్సర్ కు సంకేతం కావచ్చు. వంట అప్పుడు వెంటనే వైద్యులకు చూపించి, పరీక్షలు చేయించుకోవాలి. ఇక నాలుక తెల్లగా ఉంటే, అది కాన్సర్ మాత్రమే కానక్కర్లేదు. అది ఓరల్ లిచెన్ ప్లానస్ కూడా కావచ్చు. ఎస్టీఐ సిఫిలిస్ అయితే మరింత ప్రమాదకరం. అందుకే బ్రష్ చేసి, టంగ్ ను క్లీన్ చేసుకున్న తర్వాత కూడా తెల్లటి ప్యాచ్ కనిపిస్తే వైద్యులకు సంప్రదించాలి.

నోటి అల్సర్లు/పుండ్లు: నోటిలో అల్సర్లు కూడా కొంత మందికి సాధారణంగా వస్తుంటాయి. అప్పుడప్పుడు రావడం, వాటంతట అవే మానిపోవడం సహజమే. హార్మోన్లలో మార్పులు, బీ విటమిన్లు, జింక్, ఐరన్ లోపం వల్ల నోటిలో పుండ్లు కనిపిస్తుంటాయి. రోగ నిరోధక శక్తి బలహీనపడడం వల్ల కూడా ఇవి కనిపిస్తాయి.

నోటి దుర్వాసన: నోటి ఆరోగ్యాన్ని సూచించే ప్రథమ సంకేతం శ్వాస. నోటి నుంచి మనం విడుదల చేసే శ్వాస చెడు వాసన వస్తుంటే చుట్టుఉన్న వారు ఎంతో అసౌకర్యానికి లోనవుతారు. నోటి శుభ్రత తెలియని వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు. చిగుళ్ల వ్యాధి ఉన్నప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది.

కార్నర్ క్రాకర్: పెదాల పక్క భాగాల్లో మడతల వద్ద క్రాక్ లు కనిపించినట్టయితే అది ఐరన్, జింక్, బీ విటమిన్ల లోపంగా చూడాలి. జీర్ణ సంబంధ సమస్యలు ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. కొలియాక్ డిసీజ్, క్రాన్స్ లేదా అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వారికి పెదాల చిగుళ్లు కనిపిస్తాయి.