Site icon HashtagU Telugu

Black Hair: ఇలా చేస్తే చాలు గంటలో తెల్ల జుట్టు నల్లగా మారడం ఖాయం?

Mixcollage 29 Jun 2024 09 16 Pm 3504

Mixcollage 29 Jun 2024 09 16 Pm 3504

ప్రస్తుత రోజుల్లో చాలామంది జుట్టుకు సంబంధించిన చాలా రకాల సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో తెల్ల జుట్టు సమస్య కూడా ఒకటీ. చిన్న వయసు నుంచే ఈ తెల్ల జుట్టు సమస్య మొదలవుతోంది. దాంతో తెల్లజుట్టు నల్లగా మార్చుకోవడం కోసం రకరకాల హెయిర్ కలర్లు ఉపయోగించడంతో పాటు, ఎన్నో రకాల హోమ్ రెమెడీస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు. అలాగే ఏవో ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇంకా సమస్యలను ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవడానికి కోసం ఏం చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. మరి అలాంటివారు తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నేటి యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తెల్ల వెంట్రుకలు. తక్కువ వయసులోనే వస్తుండటంతో శాశ్వత పరిష్కారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్ డై వల్ల శరీరానికి హాని జరుగుతుందని తెలిసినా వాడుతున్నామని, సహజంగా ఏవైనా ఉంటే తెలపాలంటూ వైద్యులను కోరుతుంటారు. తెల్లవెంట్రుకలు పోవడానికి కొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను తెలుసుకుందాం.
ఇందుకోసం ముందుగా ఒక కప్పులో 3 టీస్పూన్ల ఉసిరికాయ పొడి, అరకప్పు హెన్నా పౌడర్, ఒక చెంచా కాఫీ పొడిని కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ లా చేయాలి. తర్వాత దాన్ని తలకు పట్టించి ఒక గంటసేపు ఆరనివ్వాలి. అనంతరం చల్లటి నీటితో స్నానం చేస్తే తెల్ల వెంట్రుకలు పోతాయి. మరొక రెమిడీ విషయానికి వస్తే.. ఒక కప్పు నీటిలో 2 స్పూన్ల టీ వేసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి ఆకులను మాత్రమే తీసుకుని జుట్టుకు పట్టించాలి.

30 నిమిషాల పాటు నానబెట్టి తల స్నానం చేస్తే చాలు. అదేవిధంగా.. గుప్పెడు కరివేపాకును మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత జుట్టుకు 3 స్పూన్ల కొబ్బరి నూనె రాసి ఒక గంట నానబెట్టి తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితంకనిపిస్తుంది. అలాగే నాలుగు స్పూన్ల చెంచాల హెన్నా పొడిని ఒక కప్పులో కొద్దిగా నీళ్లతో కలిపి 8 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత 2 స్పూన్ల టీ పొడి, ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూను జామకాయ పొడి వేసి జుట్టుకు రాసుకుంటే ఊహించని ఫలితం వస్తుంది. ఆ తరువాత 2కప్పుల నీటితో 6 బంగాళాదుంప తొక్కలను ఉడకబెట్టాలి. తర్వాత అందులోని నీటిని వడకట్టి విడిగా నిల్వ చేసుకోవాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ నీటిని తలకు పట్టిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.