Site icon HashtagU Telugu

Capsicum Benefits: క్యాప్సికమ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

Capsicum Benefits

Capsicum Benefits

మన వంటింట్లో దొరికే కూరగాయలలో క్యాప్సికమ్ కూడా ఒకటి. క్యాప్సికమ్ ను ఉపయోగించి ఎన్నో రకాల వంటకాలు తయారు చేస్తూ ఉంటారు. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. క్యాప్సికమ్ తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. క్యాప్సికమ్ తొక్క అలాగే గింజలు కూడా ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. క్యాప్సికమ్ ఆహారం రుచిని పెంచుతుంది. క్యాప్సికమ్‌ను పిజ్జా నుంచి పరోటా, ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ లో ఉపయోగిస్తూఉంటారు. క్యాప్సికమ్‌లో ఐరన్‌ చాలా ఎక్కువగా ఉంటుంది.

రక్తహీనతను నివారిస్తుంది. క్యాప్సికమ్ గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యాప్సికమ్ గింజల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక మినరల్స్ ఉంటాయి. క్యాప్సికమ్ విత్తనాలు అనేక సమస్యలను నయం చేస్తాయి. క్యాప్సికమ్ తింటే గుండెకు ఎంతో మంచిది. ఇందులో గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ సైటోకెమికల్స్ ఉంటాయి. క్యాప్సికమ్‌లో ఉండే మాంగనీస్.. ఎముక మృదులాస్థి, ఎముక కొల్లాజెన్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. క్యాప్సికమ్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. క్యాప్సికమ్‌లోని విటమిన్ బి6, మెగ్నీషియం, సోడియం విటమిన్లు నరాల పనితీరుకు మేలు చేస్తాయి.

క్యాప్సికమ్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. థర్మోజెనిసిస్ ఇందులో కనిపిస్తుంది. ఇది మన శరీరంలోని క్యాలరీలను చాలా వేగంగా కరిగిస్తుంది. క్యాప్సికమ్‌లో వున్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రయోజనాలు కొన్ని రకాల క్యాన్సర్‌లను నివారిస్తాయి.క్యాప్సికమ్‌లో చాలా ఎక్కువగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది. క్యాప్సికమ్ అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు కనుక మితంగా తీసుకోవాలి.

Exit mobile version