Health Benefits: తుమ్మి మొక్క వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అందులో కొన్నింటిని మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలు అని వాటిని పీకి పారేస్తూ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 03 Dec 2023 03 58 Pm 822

Mixcollage 03 Dec 2023 03 58 Pm 822

మన చుట్టూ ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అందులో కొన్నింటిని మాత్రమే మనం ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని మొక్కలను పిచ్చి మొక్కలు అని వాటిని పీకి పారేస్తూ ఉంటాం. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ప్రకృతి లో ఉండే ప్రతి ఒక్క మొక్క ఏదో ఒక సమస్యకు ఉపయోగపడుతుంది.. అటువంటి వాటిలో తుమ్మి మొక్క కూడా ఒకటి.. చాలామంది ఈ మొక్కను చూడగానే పిచ్చి మొక్క అని అంటూ ఉంటారు. కానీ ఆ మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం నోరెళ్ళ బెట్టాల్సిందే. తుమ్మి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకి వచ్చే ఎన్నో వ్యాధులను తగ్గించడానికి ఇది ఔషధంలా పనిచేస్తుంది.

మరి తుమ్మి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలో నొప్పులు వాపులు ఉన్నచోట ఈ మొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులను దంచి కట్టుగా కట్టడం వలన ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోట్లో కొద్దిసేపు ఉంచుకొని పుక్కిలించి ఉమ్మడం వలన నోటి పూత కూడా తగ్గిపోతుంది. తాజా తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలు వేసుకోవడం వల్ల సైనసైటిస్ తగ్గుతుందట. ఈ తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఈ మొక్క ఆకులతో చేసిన కూరను తినడం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అజీర్తి సమస్య కూడా తగ్గుతుంది. జలుబు, దగ్గు, ఆయాసం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

తేలు పాము విషాన్ని హరించడంలోని ఈ మొక్క ఎంతగానో సహాయపడుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్తగా దంచి రసాన్ని తీసుకోవాలి.ఈ రసాన్ని తేలు లేదా పాము కుట్టిన ప్రదేశంలో వేయాలి. తేలు లేదా పాము కుట్టిన మనిషికి కూడా ఈ రసాన్ని టీ స్పూన్ చొప్పున తాగించాలి. అలాగే దంచిన ఆకులను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి కట్టుగా కట్టడం వల్ల తేలు కాటు పాము కాటు ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది.

  Last Updated: 03 Dec 2023, 03:58 PM IST