Benefits of Conch Flower to Skin : ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలను అందించింది. అందులో మనం కొన్నింటిని మాత్రమే ఉపయోగిస్తూ ఉంటాం. కొన్ని మొక్కల గురించి వాటి విలువలు గురించి తెలియక వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటాం. అటువంటి వాటిలో శంఖం పువ్వు (Conch Flower) మొక్క కూడా ఒకటి. శంఖం పువ్వు (Conch Flower) మొక్క వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఈ శంఖం పువ్వు (Conch Flower) మొక్క వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
శంఖం పూలునే సింగపూర్ పువ్వులు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకులు, పువ్వులు ,కాండం ప్రతి ఒక్కటి కూడా ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఉపయోగాలు కలిగిస్తుంది. ఈ మొక్క ఎన్నో ఆరోగ్య ఉపయోగాలను అనేక రకాల గా సహాయపడుతుంది. చర్మానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. దానికోసం ఈ పువ్వులను లేదా సింగపూరు పువ్వులను తీసుకొని ఒక గాజు సీసాలో వెయ్యాలి. దీనిలో ఒక గ్లాస్ వేడి నీటిని పోసుకోవాలి. నీళ్లు పోసుకుని మూత పెట్టాలి. కొద్దిసేపటికి పువ్వులు రంగులోకి నీళ్లు కూడా మారిపోతాయి. ఒక గంట తర్వాత పువ్వులు నీళ్లు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తని పేస్టులా పట్టుకోవాలి. దీనిని స్రైనర్ తో వడ పోసుకోవాలి. నీళ్లను తీసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి.
దీనిలో ఆ ఫ్లవర్ వాటర్ ని కూడా వేసుకొని బాగా క్రీమ్ లా వచ్చేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టి నీళ్లను వేసి బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని ముందుగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని పెట్టి మళ్ళీ మరగ పెట్టుకోవాలి. ఈ మిశ్రమం క్రీమ్ లా అయ్యే వరకు బాగా తిప్పుతూ ఉండాలి. తర్వాత స్టౌ ఆపుకొని ఈ మిశ్రమం చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. తర్వాత మరొక బౌల్ ని తీసుకొని ఒక స్పూను అలోవెరా జెల్లి కూడా తీసుకోవాలి. దీనికోసం ప్లాంట్ బేస్ అలోవెరా జెల్లీ ఉపయోగించవచ్చు. తర్వాత దీనిలో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ముందుగా తయారుచేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ అలాగే శంఖం పువ్వుల నీళ్లతో చేసుకున్న మిశ్రమంలో మిక్స్ చేసుకోవాలి.
ఈ క్రీమ్ హెయిర్ టైట్ కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్రిజ్లో రెండు నెలల వరకు ఈ మిశ్రమం నిల్వ ఉంటుంది. ఈ క్రీమ్ ప్రతిరోజు ముఖానికి పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మృదువుగా మసాజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వలన డార్క్ సర్కిల్స్ ,అలాగే ముడతలు, నల్లటి మచ్చలు సమస్యలు అన్ని తగ్గిపోయి ఫేస్ గ్లో గా మారుతుంది. .
Also Read: Copper Sun : వాస్తు ప్రకారం ఇంట్లో రాగి సూర్యుడిని ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?