Site icon HashtagU Telugu

Egg Yellow Yolk : గుడ్డులోని పచ్చసొనను తినకూడదా..?

Eggs Benefits

Eggs Benefits

గుడ్లు (Eggs) ఓ ముఖ్యమైన ఫుడ్. మనందరం వీటిని తినేందుకు ఇష్టపడతాం. ఎక్కువగా ఉడకబెట్టిన గుడ్లను తింటాం. అయితే, చాలా మంది పచ్చసొన అంత ఆరోగ్యకరం కాదని అంటారు. గుడ్డులో పచ్చసొన (Egg Yellow Yolk) కొలెస్ట్రాల్‌కి కారణమని చెబుతారు. ప్రజలు గుడ్డులో పచ్చసొనని (Yellow Yolk) తినకుండా, తెల్లసొనని (White Yolk) మాత్రమే తినడానికి ఇదే కారణం. మరి నిజంగా పచ్చసొన మంచిది కాదా..? దీనిని తినడం వల్ల నష్టం ఉంటుందా..? డాక్టర్స్ ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..

ఈ మధ్య కాలంలో డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ (Dr. Priyanka Sehrawat), MD, DM, Neurology (AIMS, Delhi) తన ఇంస్టాగ్రామ్  లో (Instagram) గుడ్లపై (Eggs) ఉన్న అపోమ గురించి చర్చించింది. డాక్టర్ సెహ్రావత్, గుడ్డు పచ్చసొన (Egg Yellow Yolk) గురించి మాట్లాడారు. దానిని వద్దనుకోవడానికి కారణం గురించి తెలుసుకోవాలని అనుకున్నారు.

ఇంస్టాగ్రామ్ పోస్ట్:

 

మనం తెలుసుకోవాలసినవి:

 

సెలీనియం (Selenium) లోపం సంకేతాలు:

సెలీనియం లోపంతో సంబంధం ఉన్న లక్షణాలు.. వికారం, వాంతులు, తలనొప్పి, గందరగోళం, బద్దకం, మూర్ఛ, కోమా. గుడ్డు తెల్లసొనలో పుష్కలంగా విటమిన్ ఎ, డి, ఇ, ఫోలేట్ (Folate), విటమిన్ బి12, అమైనో యాసిడ్స్ (Amino Acids), ట్రిప్టోఫాన్ (Tryptophan), టైరోసిన్ (Tyrosine) వంటి ముఖ్య పోషకాలు కూడా ఉన్నాయి. గుడ్డు పచ్చసొనలో పొటాషియం (Potassium), సోడియం (Sodium), జింక్ (Zinc), మెగ్నీషియం (Magnesium), ఫాస్ఫరస్ (Phosphorus), ఐరన్ (Iron) కూడా ఎక్కువగా ఉంటాయి. ఓ పెద్ద గుడ్డులో 55 కేలరీలు, 2.5 గ్రాముల ప్రోటీన్, 4.5 గ్రాముల కొవ్వు, 0.61 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది.

Also Read:  Yoga for Your Healthy Heart : మీ గుండె క్షేమంగా ఉండాలంటే…