చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా పెరుగును ఇష్టంగా తింటూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగును ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. చాలామందికి పెరుగు లేనిదే ముద్ద కూడా దిగదు. పెరుగు తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగును తరచుగా తీసుకోవడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు. అయితే పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ పెరుగుతో పాటు కొన్ని రకాల కూరగాయలు తీసుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు.
మరి పెరుగుతో పాటు ఎలాంటి కూరగాయలు కలిపి తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లి పెరుగు కలిపి అస్సలు తినకూడదట. ఇవి రెండు కలిపి తింటే కడుపు ఉబ్బరం అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఈ రెండు కలిపి తినకపోవడమే మంచిది. పెరుగు ఉల్లిపాయ కలిపి తీసుకోవడం వల్ల పేగు నొప్పి వస్తుందట. ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా జీర్ణం అవ్వదు. దాంతో కడుపులో సమస్యగా ఉంటుంది. మీకు ఆల్రెడీ జీర్ణ సమస్యలు ఉంటే కాంబినేషన్ ను అవాయిడ్ చేయడమే మంచిదని చెబుతున్నారు. అలాగే ముల్లంగిలో వేడి స్వభావం ఉంటుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుందట. అలాగే జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అలాగే ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ కాంబినేషన్ కూడా అంత మంచిది కాదట. అలాగే చాలా మంది సలాడ్‌లో పెరుగు, దోస వేసుకుని తింటారు. కానీ అస్సలు ఇది అస్సలు మంచి కాంబినేషన్ కాదట. దోసకాయలో 70 శాతం నీరు ఉంటుంది. దోసకాయని పెరుగుతో కలిపి తింటే జీర్ణాశయంలో సమస్యల్ని తీసుకొస్తుందట. కాబట్టి పెరుగుతో దోసకాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. మనం ప్రతిరోజూ వాడే కూరగాయల్లో టమాటలు ఒకటి. టమాటలు సహజంగానే ఆమ్ల గుణంతో నిండి ఉంటాయి. దీనిని పెరుగుతో కలిపి తిన్నప్పుడు అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయి. పెరుగులో కూడా ఆమ్ల గుణాలు ఉంటాయి. ఈ రెండు కలిసినప్పుడు అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని కలిపి తినక పోవడమే మంచిదని చెబుతున్నారు.