Site icon HashtagU Telugu

Eggs: కోడిగుడ్డు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 03 Mar 2024 10 12 Am 499

Mixcollage 03 Mar 2024 10 12 Am 499

కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కోడి గుడ్డును తినడం మంచిది కానీ, కోడిగుడ్డు తినేటప్పుడు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదు. గుడ్డు తినడం వలన మన ఒంట్లోని కొవ్వు ను అరికట్టవచ్చు. అంతేకాకుండా మన శరీరానికి అవసరమైన మంచి కొవ్వుని సరఫరా చేస్తుంది.

గుడ్డు తినడం వలన మీ బరువు నియంత్రణలో ఉంటుంది. గుడ్డులో కేలరీలు ఉన్నాయి. కానీ వాటి వలన మనం బరువు పెరగడం గుడ్డు తినడం వలన మన కడుపు నిండినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువగా ఏది తినాలనుకోమో ఆకలి కూడా అనిపించదు. అలా అవడం వలనే మనము బరువు పెరగకుండా అరికట్టగలం. గుడ్డు కంటికి కూడా చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజు మీ ఆహారంలో గుడ్డును చేర్చడం వలన కంటి నరాల క్షీణత నుంచి కాపాడుతుంది. అంతేకాదు రోజు గుడ్డు తినడం వలన శుక్లాల ప్రమాదం కూడా తగ్గుతుంది. అలాగే గుడ్డు మీ శరీరంలోని రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. దాని వలన మీకు బిపి, గుండె జబ్బులు రావడం చాలా వరకు తగ్గుతుంది.

రోజు గుడ్డు తినే వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా చాలా తక్కువ. అంతేకాదు గుడ్డు తీసుకోవడం వలన మీ మెదడు నరాల పనితీరు చాలా మెరుగుపడుతుంది. అంటే వయస్సు పైబడినాక వచ్చే వ్యాధులు గుడ్డు తినే వాళ్ళలో వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎప్పుడైనా మీరు శక్తి తగ్గినట్టుగా అనిపిస్తేస్తే వెంటనే ఒక గుడ్డు తినండి. గుడ్డు మీ శరీరానికి ఇన్స్టంట్ ఎనర్జీని అందిస్తుంది. సోమరితనాన్ని దూరం చేస్తుంది. గుడ్డుని ఎనర్జీ బూస్టర్ అని కూడా పిలుస్తారు. గుడ్డులో ఒక్క మాటలో చెప్పాలంటే మీ మెదడుకు, గుండెకు, నరాలకు, ఎముకలకు, జుట్టుకు, చర్మానికి, కంటి చూపుకు అన్నిటికీ ఒక్క గుడ్డుతో ప్రయోజనం పొందవచ్చు. ఇప్పటివరకు తినేవాళ్ళకైతే నేనేం చెప్పను కానీ తినని వాళ్ళు ఉంటే గనక ఈరోజు నుంచి రోజు ఒక గుడ్డు తినడం మొదలు పెట్టండి. ఒక రెండు నెలలు తిన్న తర్వాత మీ ఒంట్లో జరిగే మార్పులు మీరే గమనిస్తారు.