Site icon HashtagU Telugu

Summer Care: సమ్మర్‌‌లో హెల్దీగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే!

Fruit vs Fruit Juice

Eat Fruits And Vegetables In Winter Season

ఏ కాలంలోనే ఇమ్యూనిటీ ఉండాల్సిందే. ఇక ఎండాకాలంలో ఇమ్యూనిటీ తక్కువ అయితే చాలా ఇబ్బందులు పడాల్సిందే. చర్మంపై అలర్జీలు, దగ్గు, ఫ్లూ లాంటివి వస్తుంటాయి. అందుకే సమ్మర్‌లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటంటే.. సమ్మర్‌‌లో హెల్దీగా ఉండాలంటే సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి.. లాంటి సిట్రస్‌ ఫుడ్‌ను సలాడ్స్‌, జ్యూస్‌ రూపంలో తీసుకోవచ్చు. సిట్రస్‌ ఫ్రూట్స్‌లో ఉండే సీ-విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సమ్మర్‌లో క్యారెట్‌, గుమ్మడికాయ, బీట్‌రూట్‌లు తినడం ద్వారా విటమిన్ ఏ, ఫైబర్, పొటాషియం లభిస్తుంది. వీటిని తినడం ద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే ప్రొటీన్ ఫుడ్ తీసుకోవడం కూడా అవసరం. అందుకే సమ్మర్‌లో పప్పులు, గుడ్లు, చేపలు, నట్స్ లాంటివి కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెరగడాలంటే శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండడం అవసరం. అందకే సమ్మర్‌లో దాహం వేయకపోయినా నీళ్లు, జ్యూస్‌లు, నిమ్మరసం లాంటివి ఎక్కువగా తాగుతూ ఉండాలి. బాదం, పిస్తా, జీడిపప్పు వంటి నట్స్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, నియాసిన్‌, జింక్‌, సెలేనియమ్‌ వంటి న్యూట్రియెంట్లు సమ్మర్‌‌లో ఇమ్యూనిటీని పెంచడానికి హెల్ప్ అవుతాయి. సమ్మర్‌‌లో పిల్లలు, గర్భిణులకు నట్స్ చాలా మంచివి.

సమ్మర్‌లో దొరికే పుచ్చకాయ, కర్భూజా లాంటి సీజనల్ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల మాంగనీస్, విటమిన్‌ ఏ, పొటాషియం లభిస్తాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు రక్తపోటును కూడా అదుపులో ఉంచుతాయి. ఇకపోతే సమ్మర్‌లో మసాలాలు, కారం, వేపుళ్లు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యూనిటీ దెబ్బతినే అవకాశముంది.

Exit mobile version