Site icon HashtagU Telugu

Health: ఈ టిప్స్ తో స్లిమ్ గా మారొచ్చు.. అవి ఏమిటో తెలుసా

Winter Weight Loss Drinks

Winter Weight Loss Drinks

Health: ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారికి.. నడుం చుట్టూ రింగులా కొవ్వు ఏర్పడుతుంది. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ ఆ తర్వాత మాత్రం బరువు పెరుగుతూ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక టిప్స్ పాటించాలి. అన్నం, రోటీలు, తృణధాన్యాలతో తయారుచేసిన ఆహారం కానీ తీసుకోకుండా కేవలం ఆకుకూరలు, కూరగాయలతో తయారుచేసిన రెండు రకాల కూరలను తింటే శరీరంలో ఉన్న కొవ్వు తొందరగా తగ్గుతుందని చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయలలో కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ శాతం ఉంటాయని, శరీరానికి కావలసిన పోషకాలు మెండుగా ఉంటాయని చెప్తున్నారు.

అందుకే వాటిని మాత్రమే భోజనం లో భాగంగా చేసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలి అనుకునేవారికి మంచి రిజల్ట్ వస్తుందని చెబుతున్నారు. ఖచ్చితంగా రెండు, మూడు నెలలు ఈ డైట్ ను కఠినంగా ఫాలో అయితే ఆశించిన మేరకు ఫలితం వస్తుంది.

ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసోల్‌ అనే హార్మోన్‌ విడుదలై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. కాబట్టి, ఒత్తిడిని వదిలించు కోవాలి. కుటుంబంతో, స్నేహితులతో సమయం గడపడం, యోగా, ధ్యానం ఒత్తిడిని కొంతమేర నివారిస్తాయి. అంతేకాదు, ఆల్కహాల్‌ మితం తప్పి తీసుకోవడం వల్ల శరీరానికి తీవ్ర హాని కలుగుతుంది.