workouts: వర్కవుట్స్ చేయకుండానే ఫిట్ గా ఉండొచ్చు.. ఎలాగో తెలుసా!

చాలామందికి రన్నింగ్, జాకింగ్, వాకింగ్, వర్కవుట్స్ లాంటివి చేయడం కుదరకపోవచ్చు.

  • Written By:
  • Updated On - May 25, 2023 / 11:48 AM IST

ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి రన్నింగ్, జాకింగ్, వాకింగ్, వర్కవుట్స్ లాంటివి చేయడం కుదరకపోవచ్చు. ఒకరోజు వీలైతే మరో రోజు వ్యాయమాలు చేయడానికి టైం ఉండకవపోచ్చు. వర్కవుట్స్ చేయడం లేదని లోలోపల బాధపడుతుంటారు. అలాంటివాళ్లు ఎక్సైర్ సైజ్ లు చేయకుండానే ఫిట్ గా ఉండొచ్చు.

వర్కవుట్స్ చేయలేని వాళ్లు చల్లని నీరు తాగే బదులు గోరువెచ్చని నీటిని తాగడాన్ని అలవాటు చేసుకోవాలి. అలా చేయడం వల్ల తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. తీసుకునే ఆహారంలో పంచదారను అవాయిడ్ చేయాలి. చక్కెర వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. అందుకే పంచదారకు బదులు బెల్లం, తేనె వంటివి ఉపయోగించడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండొచ్చు. వ్యాయామం చేయలేకపోయినా.. కేవలం నడవడం ద్వారా ఫిట్‌గా ఉండొచ్చు.

ఇల్లు, ఆఫీసులో అటు ఇటు నడుస్తూ రోజుకు కనీసం మూడు నుంచి ఐదు వేల అడుగులు నడిచేలా చూసుకోవాలి. ఫ్రూట్స్‌తో జ్యూస్ చేసుకుని తాగే బదులు డైరెక్ట్‌గా ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి మరికొన్ని ఇతర పోషకాలు, ఫైబర్‌ అందుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. యాక్టివ్ లైఫ్ స్టైల్ లేనివాళ్లు ప్రతి రోజు ఒకే టైంకి తినడం , తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోవడం వల్ల వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. వీటితో పాటు తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్ కంటే ప్రొటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చు. ఆఫీస్ లో లిఫ్టుకు బదులు మెట్ల ద్వారా నడిస్తే కొంత లాభం ఉంటుంది కూడా. వీలైతే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేసుకోవచ్చు.