Site icon HashtagU Telugu

Curd-Honey: పెరుగులో తేనె కలుపుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Curd Honey

Curd Honey

పెరుగు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పెరుగును తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజులో కనీసం ఒక్కసారైనా పెరుగుతో భోజనం చేయనిదే చాలామందికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. నిజానికి పెరుగును కాలాలతో సంబంధం లేకుండా తింటే ఆరోగ్యానికి ఎలాంటి డోకా ఉండదట. పెరుగులో మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమై కాల్షియం, పొటాషియం, విటమిన్ బి2, విటమిన్ బి12 వంటి పోషకాలు మెండుగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే పెరుగు చలువ చేసే గుణాన్ని కలిగి ఉంటుందట.

దీన్ని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుందని చెబుతున్నారు. కాగా ఎముకల అరుగుదల, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. అయితే ఇలాంటి సమస్యలు ఉన్నవారు రోజూ పెరుగును తింటే ఈ సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చట. అలాగే పెరుగు గట్ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుందట. ఇందులో ప్రోబయోటిక్స్ అనే ఆమ్లం ఉంటుందట. ఇది గట్ ను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందట. పెరుగును ఉపయోగించి జుట్టుకు సంబంధించిన సమస్యలను కూడా తగ్గించుకోవచ్చట. ఇందుకోసం పెరుగును నేరుగా తలకు అప్లై చేస్తే చుండ్రు తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే జుట్టు డ్రైనెస్ తగ్గిపోతుందట. తలపై ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. కాగా పెరుగును తరచుగా తినడం వల్ల మీరు ఎన్నో వ్యాధులకు దూరంగా ఉండవచ్చట.

దీన్ని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందని చెబుతున్నారు. పెరుగును తింటే గట్ ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, జీర్ణక్రియకు కూడా సహాయపడుతుందట. దీంతో మీకు కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్దకం వంటి సమస్యలు తగ్గిపోతాయట. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్న పెరుగులో తేనే కలుపుకుని తీసుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తేనె కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. తేనె మనకు ప్రకృతి అందించిన ఒక దివ్య ఔషధం అని చెప్పాలి. తేనెలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ లు మెండుగా ఉంటాయట. పెరుగులో ప్రోటీన్లకు కొదవే ఉండదట. అలాగే తేనెలో గ్లూకోజ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది, కాబట్టి ఈ రెండింటినీ మిక్స్ చేసి తింటే ఒంట్లో ఎనర్జీ ఉంటుందట. తేనె, పెరుగు రెండింటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయట.

ఈ రెండింటిని కలిపి తింటే కడుపు, పేగులు ఆరోగ్యంగా ఉంటాయట. జీర్ణ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కాగా తేనె, పెరుగులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందట. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని,ఎముకలు ఆరోగ్యంగా ఉంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఎముకలకు సంబంధించిన సమస్యలు రావు అని చెబుతున్నారు. కాగా తేనె, పెరుగు రెండింటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందట. కాబట్టి ఈ రెండింటినీ కలిపి తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుందట. పెరుగును తేనెను ప్రతిరోజూ తింటే మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా వరకు తగ్గుతాయని చెబుతున్నారు.