Curd: మీకు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయా.. అయితే పెరుగు రోజు తినాల్సిందే!

కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తరచుగా పెరుగు తినాలని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు పెరుగు తినాలి అన్న విషయానికి వస్తే..

Published By: HashtagU Telugu Desk
Curd

Curd

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. పెరుగును తరచుగా తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. చాలామందికి పెరుగు లేనిదే ముద్ద కూడా దిగదు. కొందరు మధ్యాహ్న సమయంలో తింటే మరికొందరు రాత్రి సమయంలో పెరుగు తింటూ ఉంటారు. ఇక పెరుగును ఎన్నో రకాల వంటల్లో తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు పెరుగును మజ్జిగ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు.

అయితే పెరుగును తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అలాంటి సమస్యలు ఉన్నవారు పెరుగును తప్పకుండా తినాలని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు పెరుగు తినాలి అన్న విషయానికొస్తే.. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఇవి డయేరియా, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు కచ్చితంగా పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకి క్రిముల ద్వారా వచ్చే సమస్యల్ని దూరం చేస్తుందట.

అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని దీని వల్ల సీజనల్ సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. ​బరువు పెరగడం వల్ల చాలా మందికి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి బరువుని తగ్గేందుకు పెరుగు తీసుకుంటే సమస్యలు కూడా దూరమవుతాయట. దీని వల్ల గుండెకి చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కాబట్టి, గుండెకి చాలా మంచిదని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకుంటున్నారు తరచుగా పెరుగు తినడం వల్ల ఈజీగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయట. పెరుగు తింటే చాలా సేపు కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఎక్కువగా తినరు. కాబట్టి, త్వరగా బరువు తగ్గుతారు.పెరుగులో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా, కాల్షియం, ప్రోటీన్, పొటాషియం, పాస్ఫరస్, విటమిన్ డి వంటివి పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, పెరుగుని రెగ్యులర్‌గా తింటే ఎముకలకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. రెగ్యులర్‌గా మనం పెరుగుని మన డైట్‌లో యాడ్ చేసుకుంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి. అంతేకాకుండా యోని ప్రాంతంలో వచ్చే దురద, దద్దులు వంటిస సమస్యలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు.

  Last Updated: 10 Jan 2025, 03:12 PM IST